ప్లాస్టిక్‌ సర్జరీ పుకార్లపై హీరోయిన్‌ ఫన్నీ రియాక్షన్‌

బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్‌ చేసి వెండి తెరపై అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రాధిక మదన్.;

Update: 2025-04-15 19:30 GMT
ప్లాస్టిక్‌ సర్జరీ పుకార్లపై హీరోయిన్‌ ఫన్నీ రియాక్షన్‌

బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్‌ చేసి వెండి తెరపై అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రాధిక మదన్. సుదీర్ఘ కాలం పాటు బుల్లి తెరపై కొనసాగిన ఈమె వెండి తెరపై ఈ మధ్య కాలంలో బిజీ అయింది. హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. అంతే కాకుండా అందంతో అలరిస్తూ వస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, నటనలో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన రాధిక మదన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాధిక మదన్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఒక వీడియో సోషల్‌ మీడియాను షేక్ చేసింది.

ఒక నెటిజన్‌ షేర్‌ చేసిన రాధిక మదన్ వీడియో సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఈమె నిజంగానే రాధిక మదన్‌ అయ్యి ఉంటుందా అని కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ వీడియోతో పాటు సదరు నెటిజన్‌ రాధిక మదన్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది అంటూ కామెంట్‌ పెట్టాడు. అంతే కాకుండా పలువురు హీరోయిన్స్ మాదిరిగా ఈమె కూడా తనకు తాను కొత్తగా కనిపించడం కోసం, జనాలకు కొత్తగా తనను చూపించడం కోసం సాహసం చేసింది అంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. అయితే రాధిక మదన్‌ ప్లాస్టిక్‌ సర్జరీ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్న నేపథ్యంలో వెంటనే ఆమె స్పందించింది. అందుకు సరైన సమాధానం ఇచ్చింది.

ఏఐ ద్వారా రాధిక మదన్‌ డీప్‌ ఫేక్ వీడియోను తయారు చేసి ఉంటారు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సినిమా రంగంలోని సెలబ్రెటీలకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వస్తూనే ఉన్నాయి. రాధిక మదన్‌ తన డీప్ ఫేక్ వీడియోపై స్పందించింది. ఆమె ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఏఐ ని ఉపయోగించి మీరు కను బొమ్మలను మరింత పైకి అన్నారు. ఇంకా ఏమైనా చేయండి, ఏది చేసినా నేచురల్‌గానే కనిపిస్తుందని లాఫ్ ఈమోజీని రాధిక మదన్‌ షేర్ చేసింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆ వీడియోను చూసి చాలా మంది షాక్‌ అయ్యారు. నిజంగానే రాధిక ఇలా తయారు అయింది. ఇంత తక్కువ సమయంలో మరీ ఇంత మార్పు సాధ్యమా.. ప్లాస్టిక్ సర్జరీ వల్ల అందం పెరిగిన వారు ఉన్నారు.. కానీ ఈమెకు అందం తగ్గింది అంటూ కొందరు కామెంట్‌ చేశారు. మొత్తానికి రాధిక మదన్ వైరల్‌ వీడియో గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ముందు ముందు కూడా ఈ అమ్మడు అందంగా కనిపించాలని, నేచురల్‌ బ్యూటీగానే ఉండాలని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఏఐ వీడియో అయ్య ఉండాలని అభిమానులు, నెటిజన్స్‌ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News