కీరవాణి ఇంట వివాహం... పెళ్లి కూతురు డాన్స్ వైరల్‌

ఈమధ్య కాలంలో సెలబ్రిటీ ఇంట్లో పెళ్లి వేడుకలో పండుగ తలపిస్తున్నాయి.

Update: 2024-12-16 07:34 GMT

ఈమధ్య కాలంలో సెలబ్రిటీ ఇంట్లో పెళ్లి వేడుకలో పండుగ తలపిస్తున్నాయి. కొందరు రాజస్థాన్‌ రాజ మహల్‌ల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటే మరికొందరు విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకొందరు గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. సినీ ప్రముఖులు తమ స్థాయి, తమ స్టార్‌డంకి తగ్గట్లుగా రిచ్‌గా పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి తనయుడు శ్రీసింహాతో సీనియర్‌ నటుడు మురళి మోహన్‌ మనుమరాలు రాగ వివాహం జరిగింది. వీరి వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్‌ అవుతున్నాయి.

మొదట రాజమౌళి దంపతులు వేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజమౌళి కొంత మందితో కలిసి దేవర సినిమాలోని ఆయుద పూజకు సంబంధించిన డాన్స్‌ చేయడం జరిగింది. ఆ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజమౌళి డాన్స్‌లు మాత్రమే కాకుండా కీరవాణి కుటుంబ సభ్యులు అందరూ డాన్స్ చేసిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా తెగ వైరల్‌ చేస్తున్నారు. తాజాగా పెళ్లి కూతురు రాగ చేసిన డాన్స్ సైతం వైరల్‌ అవుతోంది. దేవర సినిమాలో పెళ్లి కూతురు డాన్స్ వేసినట్టుగా రాగ సైతం డాన్స్ వేసుకుంటూ పెళ్లి పీటల వరకు చేరింది.

చేతిలో కొబ్బరి బొండాతో రాగ డాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాగ వెనుక ఉన్న నటుడు మురళి మోహన్‌ సైతం స్టెప్స్ వేసుకుంటూ మనుమరాలికి ముందుకు సాగారు. ప్రస్తుతం అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. పెళ్లిలో అంతా డ్యాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డాన్స్ వేయడం ఒక ఎత్తు. అందుకే సింహా, రాగ పెళ్లి వేడుకలో ఈ డాన్స్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో పెళ్లిలు వైభవంగా జరిగాయి, కానీ ఇంతగా వీడియోలు వైరల్‌ కావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

కీరవాణి ఇద్దరు కొడుకుల్లో కాళ భైరవ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా, శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. మత్తు వదలరా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా ఇటీవల మత్తు వదలరా 2 తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్న శ్రీసింహా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడు. రాగతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన శ్రీసింహా ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కథలు వింటున్నాడు. వైభవంగా జరిగిన వీరి వివాహ బంధం కలకాలం కొనసాగాలంటూ ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News