లోకేష్ బెంజ్ కోసం పవర్ఫుల్ విలన్

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు

Update: 2024-12-10 15:36 GMT

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరో వైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో రాఘవ లారెన్స్ తో ‘బెంజ్’ అనే సినిమాని రీసెంట్ గా ఎనౌన్స్ చేశారు. మూవీ ప్రోమో రిలీజ్ చేసి అఫీషియల్ గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు.

ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘రెమో’ సినిమాతో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తరువాత కార్తీతో ‘సుల్తాన్’ మూవీ చేశాడు. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ‘బెంజ్’ మూవీ చేస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఓ స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారు. సౌత్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ ని ‘బెంజ్’ మూవీ కోసం ఫైనల్ చేసారంట. అతనికి క్యారెక్టర్ నచ్చడంతో ఒకే చెప్పారు. ఇప్పటికే మాధవన్ ఓ వైపు డిఫరెంట్ కథలతో హీరోగా మూవీస్ చేస్తూనే మరో వైపు ప్రతినాయకుడిగా కూడా ఇతర హీరోల సినిమాలలో కనిపిస్తున్నారు.

తెలుగులో ‘సవ్యసాచి’ మూవీలో మాధవన్ విలన్ గా చేశాడు. అందులో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. రీసెంట్ గా హిందీలో అజయ్ దేవగన్ ‘సైతాన్’ మూవీలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఇప్పుడు కోలీవుడ్ లో ‘బెంజ్’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర చేయడానికి ఒకే చెప్పేసారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కథలలో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి. ‘విక్రమ్’ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర ప్రేక్షకులకి ఎంతగా కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో ఒక మూవీ కూడా చేస్తానని లోకేష్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ‘లియో’లో సంజయ్ దత్, అర్జున్ విలన్స్ గా నటించి మెప్పించారు. ‘కూలీ’లో కూడా కూడా స్టార్ హీరోని విలన్ గా చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ ‘బెంజ్’ కోసం మాధవన్ ని తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లారెన్స్ కెరియర్ లో ఫస్ట్ టైం హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే లారెన్స్ కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయం అనుకుంటున్నారు.

Tags:    

Similar News