టైటిల్ అదిరింది రాజా..!

కోలీవుడ్ స్టార్ లారెన్స్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లు కాంచన సీరీస్ తో మెప్పించిన లారెన్స్ లేటెస్ట్ గా తెలుగు, తమిళ బైలింగ్వెల్ మూవీతో వస్తున్నాడు.

Update: 2024-10-02 05:37 GMT

స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా సరే కొన్నిసార్లు టైటిల్ అనేది చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది. ఫలానా సినిమాకు ఫలానా టైటిల్ అని ఫిక్స్ చేస్తే చాలు దాని మీద ఎక్కువ చర్చలు జరుగుతాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి ఒక సూపర్ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో వాడే పేర్లు భలే ఉంటాయి. అందుకే ఆడియన్స్ కు బాగా వినిపించే అలాంటి టైటిల్స్ ని ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తారు. లేటెస్ట్ గా అలాంటి ఒక టైటిల్ నే ఒక హీరో సినిమాకు లాక్ చేశారు. ఇంతకీ ఏంటా టైటిల్ ఎవరా హీరో అన్నది చూసేద్దాం పదండి.

కోలీవుడ్ స్టార్ లారెన్స్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లు కాంచన సీరీస్ తో మెప్పించిన లారెన్స్ లేటెస్ట్ గా తెలుగు, తమిళ బైలింగ్వెల్ మూవీతో వస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాల భైరవ అనే టైటిల్ లాక్ చేశారట. మగధీర సినిమాలో కాల భైరవ పేరు బాగా వినిపించింది. అంతెందుకు ఈమధ్య వచ్చిన కల్కి సినిమాలో ప్రభాస్ కూడా భైరవ పాత్రలో కనిపించాడు.

ఇప్పుడు లారెన్స్ ఏకంగా కాల భైరవ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కిల్ రీమేక్ అనుకున్నారు కానీ కాదని తెలుస్తుంది. ఏ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తుంది. కాల భైరవ టైటిల్ తో లారెన్స్, రమేష్ వర్మ ఒక క్రేజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ఏ స్టూడియోస్ హిందీ కిల్ సినిమా రీమేక్ బాధ్యతలను కూడా రమేష్ వర్మ మీద పెట్టారు.

ప్రస్తుతం లారెన్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఆ తర్వాత కిల్ తెలుగు రీమేక్ హీరో వేట కొనసాగిస్తారని టాక్. లారెన్స్ స్ట్రైట్ గా తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు కాబట్టి కచ్చితంగా సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే లారెన్స్ సత్తా ఏంటన్నది బాక్సాఫీస్ దగ్గర తెలిసేలా చేస్తుందని చెప్పొచ్చు. లారెన్స్ రమేష్ వర్మ కాంబో ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News