చిరంజీవి ప్రశంసతో రఘుబాబుకి వరుస అవకాశాలు
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే చాలదు. దానికి చాలా అదృష్టం కూడా తోడవ్వాలి.
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే చాలదు. దానికి చాలా అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టం లేకపోతే సినిమా హిట్టైనా తర్వాతి సినిమాల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. యాక్టర్ రఘు బాబుకు తన జీవితంలో ఇదే జరిగింది. నటుడిగా రఘుబాబుకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే 2005లో వచ్చిన బన్నీ సినిమానే.
ఆ సినిమాలో గుడ్డి రౌడీగా తన పాత్రను అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సినిమాలో నటించినందుకు మంచి పేరైతే వచ్చింది కానీ ఎవరూ తన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడింది లేదు. 100 డేస్ ఫంక్షన్ లో కూడా రఘుబాబుని ఎవరూ గుర్తించలేదు. అలాంటి టైమ్ లో చిరంజీవి స్టేజ్ మీదకు పిలిచి మరీ రఘుబాబుని ప్రశంసించాడు.
చిరంజీవి ఆ ఈవెంట్ లో రఘుబాబుని స్టేజ్ పైకి పిలిచి భుజంపై చెయ్యేసి మరీ చాలా బాగా చేశావని మెచ్చుకోవడంతో పాటూ బన్నీ సినిమాను మళ్లీ చూడాలంటే దానికి ఫస్ట్ రీజన్ నువ్వేనని చెప్పడంతో రఘుబాబు కెరీర్ కు ఆ మాట చాలా ప్లస్ అయింది. చిరంజీవి లాంటి నటుడు అంతలా రఘుబాబుని ప్రశంసించే సరికి ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి.
ఆ సినిమా మొదలుకుని ఇప్పటివరకు రఘుబాబు 400కి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో ఎన్నో సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈ విషయాలన్నింటినీ స్వయంగా రఘుబాబే రీసెంట్ గా ఓ ఈవెంట్ లో షేర్ చేసుకున్నాడు. చిరంజీవి వల్లే తాను ఈ రోజు ఇంత పెద్ద నటుడినయ్యానని ఆయన తెలిపాడు.