సరిపోదా శనివారం.. సోమవారం తట్టుకుంటే చాలు..
నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు.
నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 68 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. మొదటి రోజు కంటే వీకెండ్ మూడు రోజులు కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నాలుగు రోజుల్లోనే 68కోట్ల మార్క్ ని సరిపోదా శనివారం క్రాస్ చేసింది. ఆదివారం కూడా సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఓవరాల్ బిజినెస్ లో 85 శాతం ఇప్పటికే రికవరీ అయిపోయిందంట. అయితే ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ప్రభావం చిన్న చిన్న పట్టణాలలో కూడా ఉంది. ముఖ్యంగా ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో వరదల ఉదృతి ఎక్కువగా ఉంది. ఉమ్మడి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఈ తుఫాన్, వరదల ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పైన పడిందని తెలుస్తోంది.
అలాగే నైజాంలో ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలలో నదులు పొంగి వరద ప్రవాహం జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. ప్రజలు బయటకి రాలేని స్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు వరదలతో సతమతం అవుతున్నారు. విజయవాడలో అయితే చాలా థియేటర్స్ క్లోజ్ చేసే పరిస్థితి నెలకొంది. ఆదివారం రోజు ఈ ప్రభావం సరిపోదా శనివారం కలెక్షన్స్ పైన పండింది.
సోమవారం కూడా ఈ తుఫాన్, వరదల ప్రభావం సరిపోదా శనివారం సినిమా కలెక్షన్స్ పై పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ ఒక్క రోజు గండం దాటితే మరల ప్రజలు మెల్లగా సినిమాని చూడటానికి థియేటర్స్ కి రావొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంత వరకు అయితే సరిపోదా శనివారం ఎంతో కొంత హోల్డ్ చేయాల్సి ఉంటుందనే అంటున్నారు. సోమవారం నిలకడగా కలెక్షన్స్ వస్తే తరువాత మరల పుంజుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
మరి ఈ తుఫాన్ ఎఫెక్ట్ ని సరిపోదా శనివారం ఎంత వరకు తట్టుకొని నిలబడడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావం, వరదల బీభత్సం ఉంది. ఆ ఇంపాక్ట్ ని తట్టుకొని సినిమా నిలబడి భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు అలాంటి సిచువేషన్ నాని సరిపోదా శనివారం సినిమాకి కూడా వచ్చింది. మరి ఈ తుఫాన్ ప్రభావాన్ని తట్టుకొని సరిపోదా శనివారం ఎంత వరకు గండాన్ని దాటుతుంది అనేది వేచి చూడాలి.