వివాదాస్పద స్టార్ కపుల్ ఆస్తుల విలువ 3000 కోట్లు!
ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. రాజ్- శిల్పా శెట్టి జంట ఆస్తుల విలువ సుమారు 3000 కోట్లు అని తెలుస్తోంది.
శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతుల ఆస్తుల గురించి ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. రాజ్- శిల్పా శెట్టి జంట ఆస్తుల విలువ సుమారు 3000 కోట్లు అని తెలుస్తోంది. ముంబై బాంద్రా, జూహూ, పూణే, దుబాయ్, బ్రిటన్ సహా పలు దేశాల్లో అతడికి ఆస్తులు ఉన్నాయి. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలోని 19వ అంతస్తులో కుంద్రాకు అపార్ట్ మెంట్ ఉంది. భారీగా వ్యాపారాలు ఉన్నాయి. కుంద్రా ఆస్తి దాదాపు షారూఖ్ ఖాన్ సంపదలో సగం మొత్తానికి సమానం. అమితాబ్, చిరంజీవి, చరణ్, రజనీకాంత్, ప్రభాస్ కంటే గొప్ప ధనవంతుడు రాజ్‌కుంద్రా అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజ్ కుంద్రా వ్యాపారాలు అనేక దేశాలలో విస్తరించి ఉన్నాయి. భారతదేశం దాటి ముంబై, లండన్ సహా ఇతర నగరాల్లో కూడా ఉన్నాయి. అతడి విభిన్నమైన వ్యాపార పోర్ట్‌ఫోలియో వివిధ రంగాల్లో విస్తరించి ఉంది. అతడిలోని వ్యవస్థాపక చతురత ప్రాపంచిక దృష్టి ఎంతో గొప్పవి అని ఇవి నిరూపించాయి. ప్రఖ్యాత బాంబే డైయింగ్ కంపెనీ ఆయనదేనన్నది తెలిసినదే.
విలాసవంతమైన నివాసాలు జీవనశైలితో నిరంతరం ఈ జంట ఆశ్చర్యపరుస్తారు. కుంద్రా తన భార్య శిల్పా శెట్టి .. వారి పిల్లలు వియాన్ - సమీషాతో కలిసి ముంబైలోని సీఫేసింగ్ నివాసంలో నివసిస్తున్నారు. సంపన్న నివాసంలో పూర్తి స్థాయి వ్యాయామశాల స్విమ్మింగ్ పూల్ సహా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. కుంద్రా లండన్‌లో విలాసవంతమైన విల్లా, అనేక హై ఎండ్ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్నారు.
ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలోని 19వ అంతస్తులో కుంద్రా అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసారు. లగ్జరియస్ జీవనశైలికి పేరుగాంచిన రాజ్ కుంద్రా -శిల్పాశెట్టిలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసారు. ఈ జంట తరచూ స్వాన్కీ SUVలలో ప్రయాణిస్తారు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350CDI కార్ వారి గ్యారేజీలో ఉంది. ప్రఖ్యాత బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కూడా వారి సొంతం. ఈ లగ్జరీ సెడాన్ ఐశ్వర్యం, శక్తిని ఎలివేట్ చేస్తుంది. నలుపు రంగు బిఎండబ్ల్యూ i8 అతడి సొంతం. 1.5-లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఒక ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. గరిష్టంగా 250 కి.మీ/ గం.కు వేగంతో ఇది ప్రయాణించగలదు.
కుంద్రా రియల్ ఎస్టేట్ , ఆటోమోటివ్ వెంచర్‌లకు అతీతంగా రాజ్ కుంద్రా వ్యాపారాలు అతడి కుమారుడి పేరుతో ఉన్న వియాన్ ఇండస్ట్రీ లిమిటెడ్ సహా వివిధ కంపెనీలకు విస్తరించాయి. అతడు UK ఆధారిత కంపెనీలో డైరెక్టర్‌షిప్ , సీఈవో పదవులను కూడా కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ముంబైలోని ప్రఖ్యాత రెస్టారెంట్ అయిన బాస్టన్‌లో కుంద్రా- శిల్పాశెట్టి 50 శాతం వాటాను కొనుగోలు చేశారు. మీడియా కథనాల ప్రకారం కుంద్రా మొత్తం ఆస్తుల విలువ రూ. 2800 కోట్లుగా అంచనా. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అతడి విజయాలను ఇది నిర్ధారిస్తుంది.