రాజా సాబ్.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!

మారుతి మార్క్ ఎంటర్టైనర్ తో పాటు సర్ ప్రైజింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని తెలుస్తుంది.

Update: 2024-12-23 06:31 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ తో పాటు సర్ ప్రైజింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని తెలుస్తుంది.

ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేయాల్సి ఉంది. ఐతే ఈ ఎపిసోడ్ కోసం ఒక పెద్ద మహాల్ సెట్ వేశారు. రాజా సాబ్ కోసం రాజా మహాల్ ని ఏర్పాటు చేశారట. అందులోనే క్లైమాక్స్ ఎపిసోడ్స్ చేస్తారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి కథ ఎంచుకోవడం కొత్త విషయమనుకునేలా సినిమా ఉంటుందట.

థ్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ సినిమా కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. మారుతి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి కూడా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరుతాడని అంటున్నారు. మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో నుంచి రాజా సాబ్ సినిమా వస్తుంది. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని వాటిని ఆడియన్స్ థియేటర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు.

రాజా సాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని అంటున్నారు. సినిమా టీజర్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే మేకర్స్ మాత్రం రాజా సాబ్ టీజర్ ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ కి ట్రీట్ కన్ఫర్మ్ అంటున్నారు. ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువ టైం పట్టేలా ఉందని సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభాస్ రాడని తెలిసే ఏప్రిల్ 10న కొన్ని సినిమాలు రిలీజ్ లాక్ చేస్తునాయి.

Tags:    

Similar News