చివరి దశలో ఉండగా ఈ గొడవేంటి 'రాజా సాబ్'?
ఇదిలా ఉండగా, 'రాజా సాబ్' షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది. కొన్ని పాటలు, కొద్దిపాటి టాకీ పార్ట్ మినహాయించి మిగతా షూట్ కంప్లీట్ అయ్యింది.;

ప్రభాస్ నటిస్తున్న హరర్ కామెడీ చిత్రం 'రాజా సాబ్' గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ నుంచి ప్రాజెక్ట్ డిజైన్ వరకు స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఇటీవలి ఫ్యాన్స్ ఈ సినిమాపై మంచి ఆసక్తి చూపుతున్నా, ఒక్క అప్డేట్ లేకపోవడం వల్ల ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కొత్త కోణంలో చర్చ సాగుతోంది.
ఇటీవల దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. విఎఫ్ఎక్స్ పనుల వల్లే సినిమా ఆలస్యం అవుతోందని చెప్పాడు. కానీ సినిమా వాయిదాల వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయన్న గాసిప్స్ మోగుతున్నాయి. తాజాగా కొన్ని సోషల్ మీడియా పోస్టుల ప్రకారం రాజా సాబ్‌ను 3డి ఫార్మాట్‌లోకి మార్చే ఆలోచన జరుగుతోందట. ఇది నిజమే అయితే, మరో మూడు నెలల ఆలస్యం తథ్యం అనే టాక్ వినిపిస్తోంది.
దీనికి తోడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్ లోని ఓ ప్రైవేట్ స్టూడియో మధ్య బిజినెస్ విషయంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తినట్టు ఇండస్ట్రీ టాక్. అయితే ఇవన్నీ అధికారికంగా ఏదీ బయటకు రాలేదు కానీ ప్రభాస్ అభిమానుల్లో భిన్న స్పందనలు వచ్చిపడుతున్నాయి. ఇదిలా ఉండగా, 'రాజా సాబ్' షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది. కొన్ని పాటలు, కొద్దిపాటి టాకీ పార్ట్ మినహాయించి మిగతా షూట్ కంప్లీట్ అయ్యింది.
మలవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీతో పాటు హరర్, ఎమోషన్ కూడా హైలెట్ అవుతుందని మారుతి భావిస్తున్నాడట. కానీ కథనం ప్రకారం, 3డి ఎలిమెంట్స్, విఎఫ్ఎక్స్ రిచ్ విజువల్స్ కారణంగా నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగినట్టు సమాచారం.
ఇక ప్రభాస్ 'హను' సినిమాను కూడా ఒకేసారి ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అలాగే రాజాసాబ్ ప్రమోషన్స్ కు సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత ఆయన దృష్టి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా మీదే కేంద్రీకృతం కానుంది. ఈ నేపథ్యంలో 'రాజా సాబ్' కాస్త వెనకబడే అవకాశాలు లేకపోలేవు. అందుకే అభిమానులు ఇప్పటికైనా ఓ క్లారిటీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అంతా చూస్తుంటే 'రాజా సాబ్'కి ఉన్న ఇబ్బందులు కేవలం టెక్నికల్ లెవెల్లో కాదు. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెద్దగా ఉందనే స్పష్టమవుతోంది. మారుతి మొదటి సారి పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్న తరుణంలో ఇలా ఒక క్లారిటీ లేకపోవడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇప్పటికైనా సినిమా యూనిట్ ఓ స్పష్టమైన ప్లాన్ ప్రకటిస్తేనే ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుంది.