రాజా సాబ్.. జంధ్యాల, EVV రూట్లో మారుతి!

అయితే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పిన మారుతి.. ఇప్పుడు దసరా సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-22 09:30 GMT

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కెరీర్ లో తొలిసారి ప్రభాస్.. ఆ జోనర్ మూవీ చేస్తుండడంతో అటు డార్లింగ్ ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.. మంచి అంచనాలు కూడా పెట్టుకున్నారు.

అయితే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పిన మారుతి.. ఇప్పుడు దసరా సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరాకు పోటీ ఉండడంతో సోలో డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ తేదీని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం.

అదే సమయంలో సినిమాలో కామెడీకి ఎలాంటి కొదవ లేకుండా మారుతి షూట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అందుకు గాను అలనాటి దర్శకులు  జంధ్యాల,ఈవివి రూట్ లో మారుతి వెళ్తున్నారని తెలుస్తోంది. రాజా సాబ్ కోసం భారీ సంఖ్యలో కమెడియన్స్ ను రంగంలోకి దించుతున్నారట.

నిజానికి.. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సినిమాల్లో కమెడియన్స్ బోలెడు మంది ఉండేవారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. స్క్రీన్ పై నవ్వులే నవ్వులు. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేసేవారు. అలా టాప్ కమెడియన్స్ అందరూ ఓ సినిమాలో కనిపించి చాలా కాలమైంది. దీంతో మళ్లీ ఎప్పుడు అలాంటి మూవీస్ చూస్తామా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు మారుతి వారి వెయిటింగ్ కు తెర వేయనున్నారు. రాజా సాబ్ కోసం బ్రహ్మానందం, అలీతో పాటు యంగ్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, సప్తగిరిని తీసుకొచ్చారు. కోలీవుడ్ నుంచి యోగిబాబు, వీటీవీ గణేష్ ను రంగంలోకి దించారు మారుతి. వీరందరిపై షూట్ చేసిన సీన్స్ వేరే లెవెల్ హిలేరియస్ గా వచ్చాయని టాక్ వినిపిస్తోంది.

దీంతో ఇప్పుడు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. డైరెక్టర్ మారుతి ఇప్పుడు ట్రెండ్ సెట్ చేయనున్నారని చెబుతున్నారు. ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఫుల్ గా నవ్వుకోవడం పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. మరి రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. కమెడియన్ల గ్యాంగ్ ఎంతలా నవ్వించనున్నారో వేచి చూడాలి.

Tags:    

Similar News