‘ది రాజా సాబ్’.. ఇంకా పెండింగ్ వర్క్ ఎంతుంది?
ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ జానర్‌లో నటిస్తుండటంతో, దీనిపై స్పెషల్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది.
‘ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీ గురించి వస్తున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ నెవ్వర్ బిఫోర్ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దర్శకుడు మారుతి తీసుకురాబోతున్న ఈ హారర్ కామెడీ డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు ఇది వరకే ఒక క్లారిటీ ఇచ్చారు. మారుతి స్టైల్ కామెడీ, బలమైన మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా సన్నివేశాలు ఆకట్టుకునేలా వచ్చాయని సమాచారం.
ఈ చిత్రం లో ముగ్గురు కథానాయికలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ పాత్రలు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. ముఖ్యంగా స్పెషల్ మాస్ సాంగ్‌లో ఈ ముగ్గురితో ప్రభాస్ కనిపించే విధానం ప్రేక్షకులకు విశేషంగా నచ్చుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథాపరంగా విశేష ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ జానర్‌లో నటిస్తుండటంతో, దీనిపై స్పెషల్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా టీమ్, కథను మరింత హైలైట్ చేయడానికి ప్రతీ అంశాన్ని చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తోందని తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం వర్క్ బ్యాలెన్స్ చాలానే ఉందట. ఇక అనుకున్న డేట్ ప్రకారం ఈ సినిమా విడుదల జరుగకపోవచ్చు. దీనికి కారణం షూటింగ్‌లో ఇంకా 80 రోజుల నిడివి మిగిలి ఉండటమే. ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులు కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని అనుకున్నారు.
ఇక పెండింగ్ వర్క్ ను బట్టి చూస్తే ఆ లోపు సినిమాను సిద్ధం చేయడం కుదరదు. ఇక నిర్మాతలు సినిమాను మరి ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ, పెండింగ్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం కావచ్చు. ముఖ్యంగా మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కావడమే ఇప్పటి పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది.
ప్రస్తుతం అభిమానులు ప్రభాస్ నుంచి పలు హై ప్రొఫైల్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘ది రాజా సాబ్’ కూడా ఆ లిస్టులో ముఖ్యమైన చిత్రం. విడుదల తేదీ ఆలస్యం అయినా, మేకర్స్ ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఒక బ్లాక్‌బస్టర్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కుదిరితే జూన్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ప్రభాస్ డేట్స్ అనుకున్న సమయానికి సెట్టవుతాయో లేదో చూడాలి.