SSMB29: హిస్టారికల్ సెట్ పై జక్కన్న ఫోకస్

అయితే గంగానది ఒడ్డున ఉండే ఈ ఘాట్ లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి హైదరాబాద్ లోనే దానిని కోసం భారీ సెట్ వేయబోతున్నారంని తెలుస్తోంది.

Update: 2025-02-03 07:14 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. ఆమె కూడా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోన్న షూటింగ్ లో పాల్గొందని సమాచారం.

అలాగే ఈ సినిమాలో చాలా మంది ఇండియన్ స్టార్ యాక్టర్స్ భాగం కాబోతున్నారంట. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఇతర పాత్రల కోసం ఎవరు నటిస్తున్నారనే న్యూస్ బయటకి రాలేదు. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారు.

మూవీ మెజారిటీ స్టోరీ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ ని జక్కన్న ప్లాన్ చేసారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక ఎపిసోడ్ కాశీలోని మణికర్ణిక ఘాట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. అయితే గంగానది ఒడ్డున ఉండే ఈ ఘాట్ లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి హైదరాబాద్ లోనే దానిని కోసం భారీ సెట్ వేయబోతున్నారంని తెలుస్తోంది. రియలిస్టిక్ గా ఈ సెట్ నిర్మాణం ఉండబోతోందని టాక్.

ఈ సెట్ లో షూటింగ్ చేసి తరువాత దానిని విఎఫ్ఎక్స్ లో నిజమైన మణికర్ణిక ఘాట్ లా చూపించబోతున్నారంట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. త్వరలో ఈ సెట్ వర్క్ మొదలు కాబోతోందనే మాట వినిపిస్తోంది. ఇక సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోతున్న ఈ సినిమాపై ప్రపంచం మొత్తం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి జక్కన్న ఎలాంటి కథని చెబుతాడో చూడాలని అనుకుంటున్నారు.

ఇక ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత చేస్తోన్న ఇండియన్ సినిమా ‘SSMB29’ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఆమెకి ఏకంగా 35-40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఈ సినిమాతో మారబోతోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా 100 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News