మహేష్- జక్కన్న.. ఫ్యాన్స్ కు ఇప్పుడిదే పెద్ద టెన్షన్!

ఎందుకంటే.. రాజమౌళి వర్కింగ్ ప్రాసెస్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఒకటి పది సార్లు చెక్ చేసుకుంటారు.

Update: 2024-12-19 03:15 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో నెక్స్ట్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్.. తన మూవీ కోసం మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నారు. జిమ్ లో బాగా వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో ఈ మధ్య వివిధ సందర్భాల్లో కనిపించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.

అయితే ప్రస్తుతం SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ లొకేషన్స్ ను రీసెంట్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను రివీల్ చేయనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి క్యాస్టింగ్ సహా పలు విషయాలను పంచుకోనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

జనవరి చివర్లో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే అనౌన్స్మెంట్ నుంచే SSMB 29పై వేరే లెవెల్ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ఆ తర్వాత రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్.. పలు విషయాలు చెప్పి వాటిని మరింత పెంచారు. మొత్తం రెండు భాగాలుగా సినిమా తెరకెక్కనుందని.. ఫస్ట్ పార్ట్ 2026 లాస్ట్ లో రిలీజ్ కానుందని వినికిడి.

ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత ఎక్కువైందని సమాచారం. మహేష్ బాబు కష్టం తలుచుకుంటే టెన్షన్ గా ఉందని చెబుతున్నారట. అందుకు కారణం రాజమౌళేనట.

ఎందుకంటే.. రాజమౌళి వర్కింగ్ ప్రాసెస్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఒకటి పది సార్లు చెక్ చేసుకుంటారు. అనుకున్నది అనుకున్నట్లు వచ్చే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటారు. క్యాస్టింగ్ కష్టంగా ఉందన్నా.. బెస్ట్ అవుట్ పుట్ రావాలంటే కష్టపడాలి కదా అన్నట్టు సినిమాను షూట్ చేస్తుంటారు.

ఈ విషయాన్ని రాజమౌళి గత మూవీ ఆర్ఆర్ఆర్ హీరోలు చరణ్, తారక్ అనేక సార్లు చెప్పారు. నాటు నాటు సాంగ్ కు ఎన్నిసార్లు స్టెప్లులు వేశామో తెలియదని, సింక్ వచ్చేదాకా జక్కన్న వదల్లేదని అన్నారు. చెప్పాలంటే ఒళ్లు హునం చేశారని నవ్వుతూ చెప్పారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

SSMB 29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచరెస్ మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాలో అనేక రిస్కీ షాట్లు, స్టంట్స్ కచ్చితంగా ఉంటాయి. రాజమౌళి ఆ విషయంలో అస్సలు తగ్గరు. కాబట్టి మహేష్.. షూటింగ్ విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే పెద్దలు అన్నారుగా కష్టే ఫలి అని.. అంత కష్టపడ్డారు కాబట్టి నాటు నాటుకు ఆస్కార్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మహేష్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే అవన్నీ మర్చిపోవడం పక్కా.

Tags:    

Similar News