రాజ‌మౌళి నెక్స్ట్ హీరోపై ఇంట్రెస్టింగ్!

ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఇప్ప‌టికే డైరెక్ట్ చేసేసారు. ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ కూడా వాళ్ల స‌ర‌స‌న చేరిపోతాడు.;

Update: 2025-04-14 01:30 GMT
రాజ‌మౌళి నెక్స్ట్ హీరోపై ఇంట్రెస్టింగ్!

ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత రాజ‌మౌళి రేంజ్ ఆకాశాన్నే తాకుతుంది. పాన్ వ‌ర‌ల్డ్ నే ఈ సినిమా షేక్ చేస్తుం ద‌నే అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. మ‌హేష్ ని హాలీవుడ్ హీరోల‌కు ధీటుగా అక్క‌డ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు. మ‌హేష్ లో ఉన్న హాలీవుడ్ హీరో లుక్ అప్పిరియ‌న్స్ కాన్పిడెన్స్ తో రాజ‌మౌళి న‌మ్మ‌కంగా వెళ్లిపోతున్నాడు. హిట్ అయిందంటే? హాలీవుడ్ ద‌ర్శ‌కుల జ‌క్క‌న్న పేరు చేర్చాల్సి ఉంటుంది.

`ఆర్ ఆర్ ఆర్` విజ‌యంతోనే జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గ‌జాల‌తో ప్ర‌శంలందుకున్నారు. ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత అలాంటి దిగ్గ‌జాలెంతో మంది దిగొచ్చి జ‌క్క‌న్న ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్త‌డం ఖాయం. దీంతో ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి బాధ్య‌త రెట్టింపు అవుతుంది. ఆపై తాను ఏ సినిమా చేసినా? వ‌ర‌ల్డ్ లోనే ఫేమ‌స్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఫేజ్ లో రాజ‌మౌళి హీరో ఎవ‌ర‌వుతారు? అన్న‌దే ఇంట్రెస్టింగ్.

ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఇప్ప‌టికే డైరెక్ట్ చేసేసారు. ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ కూడా వాళ్ల స‌ర‌స‌న చేరిపోతాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట‌ర్ చేసే హీరో ఎవ‌రైనా అత‌డంత అదృష్ట వంతుడు మ‌రొక‌రు ఉండ‌రు. రాజ‌మౌళి బ్రాండ్ తో నే వ‌ర‌ల్డ్ లో ఫేమ‌స్ అవ్వ‌డానికి మెండుగా అవ‌కాశా లున్నాయి. ఆ హీరో ఎవ‌రైనా కానీ అది టాలీవుడ్ నుంచే అవుతాడు? అన్న దాంట్లో సందేహం లేదు.

కానీ ఆ ల‌క్కీ స్టార్ ఎవ‌ర‌వుతాడు? అన్న‌దే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్. ఆ రేసులో ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు. ఒక‌రు నేచుర‌ల్ స్టార్ నాని కాగా, మరొక‌రు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బ‌న్నీ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ అయ్యా డు. కాబ‌ట్టి బ‌న్నీతో ఛాన్స్ తీసుకునే అవ‌కాశం ఉంది. నాని పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. కానీ నాని-రాజ‌మౌళి మ‌ద్య మంచి బాండింగ్ ఉంది. `ఈగ‌`తో నానిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది రాజ‌మౌళినే. కాబ‌ట్టి నేచుర‌ల్ స్టార్ కి అవ‌కాశం ఉంది. మ‌రి వీరిద్ద‌రు కాకుండా రాజ‌మౌళి మైండ్ లో ఇంకేవరైనా ఉన్నారా? అన్న‌ది తెలియాలి.

Tags:    

Similar News