పాతికేళ్ల రజనీ రికార్డ్‌ని చేరాలి అనుకున్నాం : రాజమౌళి
జపాన్ లో 25 ఏళ్ల క్రితం రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా విడుదల అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో చోటు సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా తర్వాత మరోసారి రాజమౌళి తన స్థాయిని ఈ సినిమాతో చూపించారు. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు దక్కించుకుంది. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా అత్యధికంగా వసూళ్లు సొంతం చేసుకుని రికార్డ్ సొంతం చేసుకుంది. జపాన్ లో 25 ఏళ్ల క్రితం రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా విడుదల అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆ రికార్డ్ అలాగే ఉంది. ఇన్నాళ్లకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
తాజాగా ఆ విషయాన్ని రాజమౌళి తన ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం రజనీకాంత్ సర్ ముత్తు సినిమాతో జపాన్‌లో రికార్డ్ సృష్టించారు. అక్కడ మా సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందని అనుకోలేదు. కానీ జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాకు చూపించిన ఆధరణ మరచిపోలేం. అక్కడి ప్రేక్షకులు సినిమాను ఆధరించిన తీరు ఎప్పటికీ మరచిపోలేను అన్నాడు. జపాన్‌లో ఈ సినిమాను విడుదల చేసే సమయంలో మాత్రం మేము ముత్తు సినిమా రికార్డ్‌ను చేరుకోవడం లక్ష్యంగా ప్రచారం చేశాం. ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయగలమా అని మాకు అనిపించినా మా ప్రయత్నాలు కొనసాగించాం అని రాజమౌళి అన్నారు.
రజనీకాంత్ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తెగ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ విషయం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. పాతిక సంవత్సరాల క్రితం టికెట్ల రేట్లు, ఆ సమయంలో ఉన్న పరిస్థితుల్లో సాధించిన వసూళ్లతో పోల్చితే ఇప్పుడు డబుల్ వచ్చినా తక్కువ అన్నట్లే అనే అభిప్రాయంను రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ విషయం గురించి ప్రముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ముత్తు సినిమా వసూళ్లను ఇప్పట్లోనే కాదు రాబోయే రోజుల్లోనూ ఏ ఒక్కరూ బ్రేక్ చేయలేరు అంటూ ఫ్యాన్స్ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజమౌళితో పాటు హీరోలు, హీరోయిన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. థియేటర్ రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. దర్శకుడిగా పరిచయం కావాలి అనుకునే వారికి ఈ డాక్యుమెంటరీ ఒక పాఠం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ను కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్‌ను అల్లూరి సీతారామరాజు పాత్రలో రాజమౌళి చూపించారు. ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు.