నోరు జారిన జక్కన్న... NTRNeel బిగ్‌ అప్డేట్‌

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.;

Update: 2025-04-15 06:55 GMT
Rajamouli On Prashanth Neel Ntr Film

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక చోట చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. పలు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ వచ్చాడు. తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మాట్లాడాడు. అదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

రాజమౌళి మాట్లాడుతూ... రామ్‌ చరణ్‌ ఇప్పటికే 'పెద్ది' సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ 'డ్రాగన్‌' సినిమాను ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి రీసెంట్‌గా చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను రూపొందిస్తాడు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ప్రశాంత్‌ నీల్‌కి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరిగింది. కేజీఎఫ్‌ ప్రాంచైజీ రెండు సినిమాలతో పాటు, ప్రభాస్‌తో రూపొందించిన 'సలార్‌' సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే మినిమం వెయ్యి కోట్ల సినిమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబోలో మూవీ ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయింది. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ షూటింగ్‌లో జాయిన్ కాలేదు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ షూటింగ్‌కి హాజరు కాబోతున్నాడు. ఎన్టీఆర్‌ నీల్‌ మూవీ అంటూ చెబుతున్నారు తప్ప అధికారికంగా టైటిల్‌ ను ప్రకటించలేదు. కానీ చాలా కాలంగా డ్రాగన్‌ అనే టైటిల్‌ను ఈ సినిమాకు కన్ఫర్మ్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో డ్రాగన్ టైటిల్‌ పుకార్లు కాదు, ఆ టైటిల్‌ పరిశీలనలో ఉందని తేలిపోయింది. దాదాపుగా అదే టైటిల్‌తో ఎన్టీఆర్‌ నీల్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆకట్టుకునే కథ, కథనంతో ఈసారి ఎన్టీఆర్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నాడు.

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత దేవర 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో మొదటి సారి నటిస్తున్న వార్‌ 2 సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌ నీల్‌ల కాంబోలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమా విడుదల కాబోతుంది. మొన్నటి వరకు 2026 సంక్రాంతికి అనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా గురించి కీలక విషయాలను ప్రకటించనున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాను సైతం పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ప్రశాంత్‌ నీల్ తీసుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News