వైర‌ల్ అవుతున్న రాజ‌మౌళి ప్రేమ వీడియో

సోష‌ల్ మీడియా బాగా పాపుల‌రైన ఈ రోజుల్లో ఏ వీడియో ఎప్పుడు ట్రెండ్ అవుతుందో తెలియడం లేదు.

Update: 2025-02-19 07:55 GMT

సోష‌ల్ మీడియా బాగా పాపుల‌రైన ఈ రోజుల్లో ఏ వీడియో ఎప్పుడు ట్రెండ్ అవుతుందో తెలియడం లేదు. ప్ర‌స్తుతం ఓ ప్ర‌ముఖ వ్య‌క్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. బుల్లితెర స్టార్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మీతో క‌లిసి ఆయ‌న చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

స్టార్ డైరెక్ట‌ర్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్న రాజ‌మౌళి ఈ వీడియోలో ర‌ష్మీ ప్రేమికుడిగా న‌టించాడు. వివరాల్లోకి వెళితే రాజ‌మౌళి గ‌తంలో ఓ సీరియ‌ల్ లో న‌టించాడు. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు బ‌య‌టప‌డి, తెగ వైర‌ల‌వుతోంది. ర‌ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ట్ చేసిన యువ సీరియ‌ల్ లో జ‌క్క‌న్న గెస్ట్ రోల్ లో క‌నిపించాడు.

యూత్ ఫుల్ కంటెంట్ తో అప్ప‌టి యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డ‌మే ధ్యేయంగా వ‌చ్చిన ఈ సీరియ‌ల్ కు మంచి ఆద‌ర‌ణే ఉండేది. ఆ సీరియ‌ల్ లోనే రాజ‌మౌళి గెస్ట్ రోల్ చేశాడు. అయితే రాజ‌మౌళి ర‌ష్మీతో క‌లిసి న‌టించింది ఓ ల‌వ్ ట్రాక్‌లో. ఈ సీన్ లో ర‌ష్మి- రాజ‌మౌళి మ‌ధ్య సంభాష‌ణ కూడా చాలా స‌ర‌దాగా ఉంటుంది.

ఓ నెటిజ‌న్ స‌ర‌దాగా ఈ వీడియోను పోస్ట్ చేయ‌గా, అది ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. అస‌లు రాజ‌మౌళి, ర‌ష్మి క‌లిసి ఎప్పుడు న‌టించార‌ని కొందరంటుంటే, వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ క‌థ ఎప్పుడు న‌డిచింద‌ని మ‌రికొంద‌రు ఆ వీడియోను చూసి కామెంట్ చేస్తూ రాజ‌మౌళి, ర‌ష్మిల‌ను ట్యాగ్ చేస్తున్నారు.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముందుగా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ను మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత శాంతి నివాసం అనే సీరియ‌ల్ తో డైరెక్ట‌ర్ గా మారాడు. ఆ త‌ర్వాతే సినీ ఇండ‌స్ట్రీలోకి ద‌ర్శ‌కుడిగా అడుగుపెట్టి మొద‌టి సినిమా స్టూడెంట్ నెం.1తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. మొద‌టి సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అప‌జ‌య‌మెర‌గ‌ని డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు.

Full View
Tags:    

Similar News