SSMB29: మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేయబోతున్నారు.

Update: 2024-10-22 04:27 GMT

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందంట. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘SSMB29’ మూవీలో క్యారెక్టర్ కి తగ్గ లుక్ లోకి వచ్చేశారు. పొడవైన జుట్టు, గెడ్డంతో మహేష్ బాబు ఈ మధ్య కనిపిస్తున్నారు. జక్కన్న ఇదే లుక్ లో మహేష్ బాబుని చూపించబోతున్నాడని అందరూ భావిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే తాజా ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘SSMB29’ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యానిమల్స్ ని ఎక్కువగా ఉపయోగించారు కదా నెక్స్ట్ సినిమాలో కూడా వాటిని వాడుతున్నారా అని అతన్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు. ‘SSMB29’ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’ లో కంటే ఎక్కువ యానిమల్స్ ఉంటాయని జక్కన్న చెప్పారు.

ఈ కామెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘SSMB29’ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రం ఉండబోతోందని రాజమౌళి గతంలోనే తెలియజేశారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథ అంటే కచ్చితంగా యానిమల్స్ కి కొదవ ఉండదు. అయితే ఈ చిత్రంలో యానిమల్స్ తో మహేష్ బాబుకి ఏమైనా ఫైట్ సీక్వెన్స్ పెడతారా లేదా అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఒక వేళ ‘ఆర్ఆర్ఆర్’ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ తరహాలో యానిమల్స్ తో ఫైట్ డిజైన్ చేస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మహేష్ అభిమానులు అంటున్నారు. ఆయన క్యారెక్టర్ కూడా అడ్వాంచర్ ట్రావెలర్ గా ఉండబోతోంది కాబట్టి కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లో ఫైట్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే వాటిని జక్కన్న ఏ రేంజ్ లో డిజైన్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ గట్టిగా ఉంటాయని అర్ధమవుతుంది.

మరో వైఫు ‘SSMB29’ నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 2025 ఆరంభంలో ఈ సినిమాని ప్రారంభించే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. మూవీలో హాలీవుడ్ హీరోయిన్ ని మహేష్ బాబుకి జోడీగా కన్ఫర్మ్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News