సూపర్ స్టార్ తో ఆయన మార్క్ యాక్షన్!
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లొకేష్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లొకేష్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ లోగా సూపర్ స్టార్ 170వ చిత్రం పూర్తి చేసి బయటకొచ్చేయాలి. అందుకు తగ్గట్టే ప్రణాళిక సాగుతోంది. అయితే లోకేష్ సూపర్ స్టార్ తో ఓ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని ఈ మధ్య సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
రజనీ ఇమేజ్ కి తగ్గట్టు ఆ కథని పూర్తిగా లోకేష్ స్టైల్ లోకి మార్పు చేసి కొత్త కథని సిద్దం చేసారని వినిపి స్తుంది. ఆ స్టోరీ సూపర్ స్టార్ కి ఎంతోనచ్చిందని కోలీవుడ్ లో ఠారెత్తిపోతుంది. అయితే తాజాగా ఈ కథనాల్ని లొకేష్ కొట్టిపారేసాడు. తాను ఏ సినిమాని రీమేక్ చేయలేదని..తన సొంత కథతోనే 171వ తెరకెక్కుతుందని వివరణ ఇచ్చారు. వచ్చే వారం నుంచి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు మొదలవుతాయి.
ఏప్రిల్ నుంచి రెగ్యలర్ షూటింగ్ ఉంటుంది` అన్నారు .దీంతో 171 రీమేక్ కాదని..లోకేష్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని తేలిపోయింది. రజనీ లాంటి నటుడుకి లోకేషలాంటోడు తోడైతే యాక్షన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. లొకేష్ యూనివర్శ్ నుంచి రిలీజ్ అయిన చిత్రాలంటే మార్కెట్ లో ఓబ్రాండ్. అలాంటి బ్రాండ్ కి సూపర్ స్టార్ కూడా తోడైతే అంచనాలు పతాక స్థాయిలోనే ఉంటాయి.
ఇటీవలే రజనీకాంత్ జైలర్ తో భారీ యాక్షన్ హిట్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత రజనీ కెరీర్ లో పడిన బ్లాక్ బస్టర్ ఇది. ఇక లోకష్ ఖైదీ..విక్రమ్ ..లియో విజయాలతో పుల్ ఫాంలో ఉన్నాడు. ఈనేపథ్యంలో 171పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం రజనీ నటిస్తోన్న 170వ చిత్రాన్ని టి.జె జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తున్నారు.