రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా సర్ ప్రైజ్.. గెట్ రెడీ!

ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది.

Update: 2024-07-28 06:47 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ "కల్కి 2898 ఏడి" తో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేస్తూ ఆయన కెరీర్ లో రెండవ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంతవరకు వసూలు చేస్తుందో అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది.


ఈ విజయం తర్వాత ప్రభాస్ మరొక ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రాబోయే సినిమా "రాజాసాబ్". పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మేజర్ పార్ట్ సెట్స్ లోనే షూట్ అవుతున్నట్లు సమాచారం.

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్ ఇండియా గ్లింప్ రాబోతోంది అని స్టైలిష్ కలర్ఫుల్ ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోమవారం సాయంత్రం 5:03 గంటలకు ఆ సర్ ప్రైజ్ రానుంది. పోస్టర్ లో ప్రభాస్ ను ఫుల్ గా చూపించలేదు. సైడ్ వ్యూవ్ లో హెయిర్ స్టైల్ హైలెట్ అయ్యేలా చేశారు.

ఈ అప్డేట్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది అని చెప్పవచ్చు. ఇక "రాజాసాబ్" కోసం మంచి కమర్షియల్ ఆల్బమ్ చేయబోతున్నట్లు తమన్ ఇటీవల ఒక ఈవెంట్ లో ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సాంగ్స్ చేయనున్నట్లు తెలియజేశారు. "బాహుబలి" తర్వాత ప్రభాస్ చేసిన చిత్రాలలో ఎక్కడా కూడా కమర్షియల్ సాంగ్స్ కనిపించలేదు.

అయితే "కల్కి" లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక సాంగ్ లో ప్రభాస్ తో డాన్స్ చేయించి ప్రేక్షకులను అలరించారు. "రాజాసాబ్" లో కూడా ప్రభాస్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. "రాజాసాబ్" చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ను త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.



Tags:    

Similar News