టాలీవుడ్‌లో మళ్లీ 'మగాడు' చర్చ..!
పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు మగాడు టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
సినిమా టైటిల్స్ పవర్ ఫుల్‌గా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఒక సినిమా టైటిల్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టైటిల్‌ను ఖరారు చేయడం జరుగుతుంది. కథతో సంబంధం ఉండటంతో పాటు, ప్రేక్షకులకు క్యాచీగా, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా క్రియేటివ్‌గా టైటిల్స్ ను పెట్టడం లో ఈ కాలం దర్శకులు ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో పాత టైటిల్స్ ను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన 'మగాడు' సినిమా టైటిల్‌ను మళ్లీ వినియోగించేందుకు రాజశేఖర్ సిద్ధం అవుతున్నారు.
రాజశేఖర్ హీరోగా కె మధు దర్శకత్వంలో మగాడు సినిమా వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన మూన్నం మూర సినిమాకు రీమేక్ గా మగాడు సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాతో రాజశేఖర్ జనాల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సినిమా ఒక కిడ్నాప్ డ్రామాగా రూపొందింది. ఆ టైటిల్‌తో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. అది కేవలం పుకార్లుగానే మిగిలింది. మహేష్ బాబు మగాడు సినిమా రాలేదు. దాంతో మగాడు టైటిల్ గురించి చర్చ జరగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ టైటిల్ గురించి చర్చ మొదలైంది.
దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ రాజశేఖర్ అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు మగాడు టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మగాడు సినిమాతో రాజశేఖర్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ సాధినేని ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన నేపథ్యంలో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టి రూపొందిస్తున్నాడు.
రాజశేఖర్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతం సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరి సినిమాలో కనిపించాడు. రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మగాడు టైటిల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రాజశేఖర్ కి భారీ విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.