సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌కి ముహూర్తం ఖరారు!
కథ రెడీ కావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ కెరీర్‌లో అతి పెద్ద విజయంగా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేశాడు. రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటికే కథను రెడీ చేశారు. జైలర్ 2 అనే టైటిల్ కాకుండా విభిన్నంగా ఉండే విధంగా, రజనీకాంత్ మార్క్ మాస్ కనిపించే విధంగా 'హుకూమ్' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. కథ రెడీ కావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
హుకూమ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూజా కార్యక్రమాలు డిసెంబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి జనవరి చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రాబోతున్న జైలర్ 2 పై అంచనాలు భారీగా పెంచే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కూలీ ఉంటుంది అంటూ దర్శకుడు ఇతర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రజనీకాంత్ ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ వస్తున్నారు. ఇటీవల విడుదల అయిన వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది అంటూ సమాచారం అందుతోంది. ఆయన నుంచి మంచి సినిమా పడితే రూ.500 కోట్ల వసూళ్లు చాలా సింపుల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈమధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా కామన్‌గా మారింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్ముతున్నారు. కూలీ సినిమా తర్వాత జైలర్ 2 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కూలీ సినిమాతో పాటు జైలర్ 2 సినిమా సైతం 2025లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ ఏడు పదుల వయసులో ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.