సూపర్‌మేన్ స్పైడర్‌మేన్‌లను కొట్టేసిన రజనీ!
భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించడంలో రజనీ స్టామినా ఏపాటిదో ట్రేడ్ వర్గాలకు స్పష్ఠంగా తెలుసు.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ముందు సూపర్‌మేన్‌లు.. స్పైడర్‌మేన్‌లు.. థోర్‌లు సరిపోరు.. బ్యాట్ మేన్..ఎక్స్ మేన్.. హల్క్ .. అవెంజర్ .. వీళ్లెవరైనా దిగదుడుపే. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్స్ చూశాక ఎవరైనా దీనిని అంగీకరించాల్సిందే. అయితే ఇక్కడ కనిపించే బాహ్యచిత్రం మాత్రమే కాదు..రజనీ గురించి డెప్త్ గా తెలుసుకుంటే ఆయన బాక్సాఫీస్ స్టామినా గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటపడతాయి.
భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించడంలో రజనీ స్టామినా ఏపాటిదో ట్రేడ్ వర్గాలకు స్పష్ఠంగా తెలుసు. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన రోబో, 2.0 లాంటి సినిమాలు విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పోటెత్తాయి. ఆన్ లైన్ బుకింగులు ఠారెత్తాయి. ఇటీవల జైలర్ విషయంలోను అలాంటి ఫీట్ రిపీటైంది. ఒక్కోసారి బ్యాడ్ ఫేజ్ లో రజనీ సినిమాలు ఫ్లాపై ఉండొచ్చు కానీ, రైజింగ్ లో ఉంటే థియేటర్లలో మాస్ శివతాండవం ఆడుతారు.
ఇటీవలే విడుదలైన రజనీ వేట్టయ్యాన్ చిత్రానికి అద్భుతమైన సమీక్షలు వచ్చాయి. కాన్సెప్ట్ ఎంతో బావుందని ప్రశంసలు కురిసాయి. అయితే వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండడం ఆశ్చర్యపరిచింది. కలెక్షన్స్ అనేవి కాలాన్ని బట్టి కూడా మారిపోతుంటాయని కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. కానీ కంటెంట్ బావుందన్న టాక్ వస్తే, కాస్త ఆలస్యంగా అయినా జనం థియేటర్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని ఇప్పుడు వేట్టయ్యాన్ తో ప్రూవ్ అవుతోంది.
రజనీకాంత్ తాజా యాక్షన్ డ్రామా- వేట్టయాన్ మూడవ శనివారం బాక్సాఫీస్ కలెక్షన్లలో స్పైక్‌ను సాధించింది.
అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం 17వ రోజు (శనివారం) దాదాపు రూ.1.15కోట్లు రాబట్టింది. శుక్రవారం నుండి కలెక్షన్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 27) వరకు ఈ ఊపు కొనసాగే అవకాశం ఉంది.
రజనీకాంత్ చివరి హిట్ జైలర్ భారీ విజయంతో సరిపోల్చడంలో విఫలమైన వేట్టైయన్ మొత్తం కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.250 కోట్లకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఇప్పటివరకు భారతదేశంలో రూ.143.3 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 246 కోట్లు వసూలు చేసింది. జైలర్ వరల్డ్ వైడ్ రూ.604.5 కోట్లు వసూలు చేయగా ఆ దరిదాపుల్లోకి వేట్టయ్యాన్ చేరుకోలేకపోయింది. వెట్టయన్ నవంబర్ 7 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానుంది.