అదే సెంటిమెంట్ రిపీట్ చేసేలా సూపర్ స్టార్ ప్లానింగ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ ఆగస్ట్ హిట్ సెంటిమెంట్ రిపీట్ కి ప్లాన్ చేస్తున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ ఆగస్ట్ హిట్ సెంటిమెంట్ రిపీట్ కి ప్లాన్ చేస్తున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. రజనీకాంత్ నటించిన `జైలర్` 2023 ఆగస్టు 10న రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలి సిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పై గా వసూళ్లను సాధించింది. చాలా కాలం తర్వాత రజనీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. దీంతో అదే ఊపులో గతే ఏడాది `లాల్ సలామ్`, `వెట్టేయాన్` చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
`లాల్ సలామ్` ఫిబ్రవరిలో, `వెట్టేయాన్` అక్టోబర్ లోనూ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలవి. కానీ వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి. రెండు సినిమాలు బడ్జెట్ రికవరీ కూడా చేయలేకపోయాయి. `వెట్టేయాన్` కంటెంట్ కి ప్రశంసలోచ్చినా కమర్శియల్ గా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో రజనీకాంత్ మరోసారి ఆగస్టు సెంటిమెంట్ నే నమ్ముంకుటున్నట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటనొచ్చింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులకు ఇదో గుడ్ న్యూస్ గా మారింది. అలాగే చియాన్ విక్రమ్ కథానాయకుడిగా `వీర ధీర శూరన్` రిలీజ్ పై కూడా ఇంత వరకూ స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అంచనా తేదీ తెరపైకి వచ్చింది. జనవరి 30 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే వారం రానుందని ప్రచారం జరుగుతోంది.