రజినీ 'కూలీ'.. మన దగ్గర రిస్కేనా?

జెట్ స్పీడ్ లో షూటింగ్ జరగ్గా.. రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మేకర్స్ ఇటీవల రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.;

Update: 2025-04-08 05:52 GMT
రజినీ కూలీ.. మన దగ్గర రిస్కేనా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలీ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

జెట్ స్పీడ్ లో షూటింగ్ జరగ్గా.. రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మేకర్స్ ఇటీవల రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో విడుదల చేసిన పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

కూలీ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సన్ పిక్చర్స్ సంస్థ. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అయితే తెలుగులో నేరుగా సినిమాను రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకుంది.

అందుకే తెలుగు థియేట్రికల్ రైట్స్ ను విక్రయించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. రీసెంట్ గా రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని.. సౌత్ ఇండియాలో కూలీ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తెలుగు థియేట్రికల్ రైట్స్ ను రూ.50 కోట్లకు అమ్మేందుకు సిద్ధమైందట సన్ పిక్చర్స్.

రజినీ, లోకేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అది సరైన డీల్ అని కొందరు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం చాలా ఎక్కువ ధర అని అంటున్నారట. ఎందుకంటే రూ.50 కోట్లకు కొనుగోలు చేస్తే.. మూవీ తెలుగు స్టేట్స్ రూ.110 కోట్లు వసూలు చేయాల్సిందే. దీంతో అది కష్టమని, రిస్క్ అని చెబుతున్నారట.

మరికొందరు ట్రేడ్ పండితులు.. తెలుగు నిర్మాతల వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, సునీల్ నారంగ్.. కూలీ హక్కులు పొందేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం. మరి తెలుగు స్టేట్స్ హక్కులను ఎవరు కొనుగోలు చేస్తారో.. సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News