ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. రజనీకాంత్ తొలి మాట ఇదే
డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ నవరాత్రి పూజకు హాజరయ్యారు.
ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోసం ప్రార్థించిన సహచరులు, అభిమానులు సహా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన కోసం ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ Xలో తన మొదటి ప్రకటనను విడుదల చేశాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ నవరాత్రి పూజకు హాజరయ్యారు.
రజనీకాంత్ తమిళంలో X లో ఒక నోట్‌ను పోస్ట్ చేసారు. ''నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నా రాజకీయ మిత్రులందరికీ, నా సినీ మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, పత్రికా - మీడియాకు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను బ్రతికించిన.. నన్ను అపరిమితంగా ప్రేమిస్తున్న అభిమానులకు, నా క్షేమం కోసం ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు`` అని అన్నారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసి శుభాకాంక్షలు పంపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ టీఎన్ రవికి ధన్యవాదాలు తెలుపుతూ వేర్వేరు పోస్ట్‌లను కూడా షేర్ చేసారు. సహనటుడు అమితాబ్ బచ్చన్ కోసం ప్రత్యేక నోట్ రాసారు రజనీ. మీ ప్రేమకు నా పట్ల ఇంత ఆప్యాయత చూపినందుకు సీనియర్ బచ్చన్‌జీకి ధన్యవాదాలు.. నిజంగా నా హృదయాన్ని తాకింది'' అని రాసారు.
ఏఎన్ఐ వివరాల ప్రకారం.. రజనీకాంత్ కుమార్తె సౌందర్య చెన్నైలోని తిరువొత్తియూర్ శ్రీ వడివుడై అమ్మన్ ఆలయాన్ని సందర్శించి, ఆయన డిశ్చార్జ్‌కు ముందు ప్రార్థనలు చేశారు. శుక్రవారం ప్రితా విజయకుమార్ హోస్ట్ చేసిన నవరాత్రి పూజ నుండి స్నేహితులతో కలిసి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటోని పోస్ట్ చేయగా ఇందులో ఐశ్వర్య సంతోషంగా కనిపించింది. పడయప్పలో రజనీకాంత్ కూతురిగా పృథ నటించింది.
రజనీకి అసలేమైంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ 30 సెప్టెంబర్ 2024న గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చేరారు. ఆయన గుండెకు చికిత్స అందించారు. గుండెకు అనుసంధానంగా ఉండే బృహద్ధమని నుండి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చింది. దీనికి శస్త్రచికిత్స చేయని, ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాకాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృహద్ధమనిలో స్టెంట్‌ను ఉంచారు. ఎండోవాస్కులర్ రిపేర్ విధానం ద్వారా వాపును మూసివేశారు. స్టెంట్ ను గుండెకు జోడించారు. అక్టోబరు 3వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని జాతీయ మీడియా వెల్లడించింది.
టిజే జ్ఞానవేల్ `వేట్టయాన్` చిత్రంలో రజనీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. అతడు లోకేష్ కనగరాజ్ కూలీ షూటింగ్ లోను పాల్గొననున్నారు.