SVSC ఆ పాత్ర రజినీకి పండుంటే..?

విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.;

Update: 2025-02-27 18:30 GMT

విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు. ఈమధ్యనే సినిమా రిలీజై పుష్కర కాలమైందని ఫ్యాన్స్ సినిమా గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ నిర్వహించారు. ఐతే దాని ప్రభావం వల్ల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ ప్లానింగ్ ఉంది. ఐతే ఈ సినిమా రీ రిలీజ్ టైం లో ఒకప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి అంటే సినిమాలో రేలంగి మామయ్య పాత్రకి సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకున్నారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. రజ్ఞిని అనుకోవడమే కాదు ఆయన్ను కలిసి కథ కూడా వినిపించాడట.

రజినితో దాదాపు ఈ సినిమా కోసం చెన్నైలో 40 నిమిషాల పాటు నరేషన్ ఇచ్చాడట శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మామయ్య పాత్ర చాలా పాపులర్. మంచి మనసు.. మంచి మాటలు.. మనిషంటేనే మంచోడు అనుకునే ఆ పాత్ర రజినీ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ అప్పుడు రజినీ ఆరోగ్య బాగా లేకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయారు.

డైరెక్ట్ తెలుగు సినిమాల్లో రజిని గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలు ఉన్నాయి. వాటిల్లో పెదరాయుడు ఒకటి. ఐతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా రజినీ నటించి ఉంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఐతే రజిని చేస్తే రేలంగి మామయ్య పాత్రలో ఏమైనా మార్పులు చేసే వాడా లేదంటే అలానే ఉంచే వారా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా వెంకటేష్, మహేష్ కలిసి నటించిన సినిమాలో రజిని నటించాల్సింది కానీ మిస్ అయ్యిందని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో స్టార్స్ ఇద్దరిని వారి ఇమేజ్ లకు దూరంగా కేవలం పాత్రల్లో మాత్రమే కనిపించేలా చేశారు. ఇద్దరి స్టార్స్ ని పెట్టి కనీసం వారి పేర్లు కూడా లేకుండా పెద్దోడు, చిన్నోడు అని శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రయోగం తెలిసిందే.

Tags:    

Similar News