జస్ట్ మిస్ వేలు పెట్టి ఈయన సక్సెస్ అయ్యాడు!
స్టార్ హీరోలతో సినిమాలంటే? స్టోరీల్లో వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ తప్పనిసరి.
స్టార్ హీరోలతో సినిమాలంటే? స్టోరీల్లో వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ తప్పనిసరి. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్లతో సినిమాలంటే? వాళ్ల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్శి యల్ అంశాలు జోడీంచాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దర్శక, రచయితలతో వాళ్లు కూడా కలిసి పని చేస్తుంటారు. సహజంగా ప్రతీ సినిమాకి ఇలాంటి పరిస్థితులుంటాయి.
అలాగని దర్శక, రచయితల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండానే తమ పరిమితులకు లోబడి ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇలా ఉంటే బాగుంటుందనే సలహాలకే పరిమితమవుతంటారు. అయితే కొన్నిసార్లు అవి సక్సెస్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఫెయిలవుతుంటాయి. ఇటీవల రిలీజ్ అయిన రజనీకాంత్ `వెట్టేయాన్` మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా రిలీజ్ అయిన సినిమా తెలుగు, తమిళ్ లో బాగా ఆడుతుంది.
ఇది పక్కా కమర్శియల్ సినిమాగా రూపొందింది. `జైభీమ్` లాంటి సందేశాత్మక సినిమా తీసిన జ్ఞాన్ వేలే ఈ సినిమా తీసాడా? అన్న సందేహం అక్కడక్కడా కలుగుతుంటుంది. కథ పరంగా చూస్తే? అంతా అతని ప్రతిభ ఆధారంగా తాయారైంది. కథలో ఎంతో విషయం ఉంది. ఎంపిక చేసుకున్న పాయింట్ యూనిక్ గా ఉంటుంది. ఓ చక్కని సందేశం కనిపిస్తుంది. కానీ రజనీ పాత్ర వరకూ వచ్చే సరికి ఆ కథని పూర్తిగా కమర్శియల్ యాస్పెక్ట్ లో చూపించారు.
రజనీ ఇమేజ్ ని బేస్ చేసుకుని రూపొందించారని క్లియర్ గా అర్దమవుతుంది. అయితే ఈ అంశంలో రజనీకాంత్ ఇన్వాల్వ్ మెంట్ ఉందనే విషయం తాజాగా కోలీవుడ్ మీడియలో తెరపైకి వచ్చింది. జ్ఞాన్ వేల్ కథ వినిపించి నప్పుడే రజనీకాంత్ తన పాత్ర ఇలా ఉండాలని ముందే హింట్ ఇచ్చేసారుట. స్టోరీ నేరేషన్ ఇస్తున్న సమయం లోనే? తన పాత్ర పరంగా ఎక్కడా ఎలా ఉండాలి? అన్నది క్లియర్ కట్ గా చెప్పారుట. ఆ పాత్రని బేస్ చేసుకునే తుదిగా కథని సిద్దం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందుకోసం అదనంగా మరో కొత్త స్క్రీన్ ప్లే రైటర్ ని తీసుకుని పని చేసారుట.