కేరళ అందాల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ టైమ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని షెడ్యూల్స్ అనంతరం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన యూనిట్ తాజాగా కొత్త షెడ్యూల్ కేరళలో మొదలు పెట్టింది. దీనిలో భాగంగా రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నాల్ పై కుటుంబ నేపథ్యంగల సన్ని వేశాలు చిత్రీకరిస్తున్నారు. రమ్యకృష్ణ ఇంతవరకూ చిత్రీకరణ లో పాల్గొనలేదు.
కేరళలో షెడ్యూల్ లో జాయిన్ అవ్వడంతో షూట్ షురూ చేసారు. ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు, రమ్యకృష్ణపై కొన్ని సోలో సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. తొలి భాగంలో రమ్యకృష్ణ పాత్ర సాప్ట్ గా మాత్రమే హైలైట్ అవుతుంది. కానీ రెండవ భాగంలో మాత్రం ఆ పాత్రకను పవర్ పుల్ గా చూపించను న్నారుట. అంటే ఫ్యామిలీ కోసం రమ్యకృష్ణ కూడా స్టైలిష్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ఆరకమైన పాత్రకు రమ్య అన్ని రకాలుగా అర్హురాలు. `నరసింహ`లో నీలాంబరిగా ఏ రేంజ్ లో పెర్పార్మెన్స్ ఇచ్చిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ 26 ఏళ్ల క్రితం నీలాంబరిని నిద్ర లేపుతున్నట్లే. ఈ సందర్భంగా నరసింహ అనుభవాలు కూడా రమ్యకృష్ణ గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసినిమా రిలీజ్ విషయంలో లీకులందుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
దీంతో ఈ సినిమాకు నెల్సన్ చాలా ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అంటే `జైలర్ 2` రిలీజ్ కోసం ఏడాది పాటు ప్రేక్షకులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాతో సంబంధం లేకుండా రజినీకాంత్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే మరో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే `జైలర్ 2` చిత్రీకరణ అనంతరం రజినీ హిమాలయాలకు వెళ్తారనే ప్రచరాం ఇప్పటికే జరుగుతోన్న సంగతి తెలిసిందే.