జైలర్ 2.. గ్లామర్ కూడా గట్టిగానే..!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటన్నది చూపించింది.

Update: 2024-12-28 03:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటన్నది చూపించింది. కొన్నాళ్లుగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించట్లేదు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. మిడిల్ ఏజ్ లుక్కే అయినా రజిని యాక్షన్ సీన్స్ అన్నీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించాయి. జైలర్ హిట్ తో తిరిగి ఫాం లోకి వచ్చిన రజిని ఈ ఇయర్ వేట్టయ్యన్ తో అలరించార్.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్న రజిని నెక్స్ట్ జైలర్ 2 ని చేస్తున్నాడని తెలిసిందే. సూపర్ స్టార్ బర్త్ డేకి సినిమా ప్రకటించగా ఫ్యాన్స్ అందరు కూడా ఈ సీక్వల్ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. జైలర్ సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ విషయంలో లెక్క తగ్గకుండా చూస్తున్నాడు నెల్సన్. జైలర్ యాక్షన్ సీన్స్ కి సూపర్ క్రేజ్ రాగా పార్ట్ 2 లో అంతకుమించి ఫైట్స్ ఉండేలా చూస్తున్నారట.

అంతేకాదు ఈసారి గ్లామర్ పరంగా కూడా ఆడియన్స్ ని ఖుషి చేసేలా చూస్తున్నారు. అందుకే జైలర్ 2 లో కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని కూడా సెలెక్ట్ చేశారు. కె.జి.ఎఫ్ 1, 2 సినిమాల తర్వాత శ్రీనిధికి వచ్చిన క్రేజ్ కు ఆమె చేస్తున్న సినిమాలకు అసలు సంబంధమే లేదు. హిట్ కొట్టాం కదా అని వచ్చిన ప్రతి సినిమా చేయాలని అనుకోలేదు శ్రీనిధి అందుకే ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటుంది. తెలుగు నుంచి ఎన్నో సినిమాల ఆఫర్లు రాగా అమ్మడు నానితో హిట్ 3, సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలు చేస్తుంది.

ఇక కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ 2 చేస్తుంది. అమ్మడు చేస్తుంది అంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క అనిపించుకోవాలని ట్రై చేస్తుంది. సూప హిట్ ఫ్రాంచైజీలో భాగం అవ్వడం కచ్చితంగా శ్రీనిధికి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. శ్రీనిధితో పాటు తమన్నా కూడా పార్ట్ 2 లో నటిస్తుందని తెలుస్తుంది. సో జైలర్ 2 యాక్షనే కాదు గ్లామర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. జైలర్ 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కూలీ షూటింగ్ పూర్తి చేసిన రజిని త్వరలోనే జైలర్ 2 షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

Tags:    

Similar News