యంగ్ హీరోలే షాక్ అయ్యేలా సీనియర్ ప్లానింగ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 74 ఏళ్లు. కానీ ఆయన పని వేగం మాత్రం రెట్టింపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.;

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 74 ఏళ్లు. కానీ ఆయన పని వేగం మాత్రం రెట్టింపు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే రెండు సినిమాలు వెంట వెంటనే ప్లానింగ్ చేసి పట్టాలె క్కించడం మాత్రం ఆయనకే చెల్లింది. కమలహాసన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు సహా తర్వాత తరం హీరోలు కూడా సూపర్ స్టార్ వేగాన్ని బీట్ చేయలేరు. ఇటీవలే `కూలీ` చిత్రాన్ని ముగించిన వెంటనే `జైలర్ 2 `చిత్రాన్ని పట్టాలెక్కించారు.
ప్రస్తుతం `కూలీ` రిలీజ్ పనుల్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ వేగవంతం చేసారు. సూపర్ స్టార్ ఈ సినిమాకు డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉంది. అలాగే పట్టాలెక్కించిన `జైలర్ 2` కూడా అంతే వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏడాది చివరికల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందంటున్నారు. ప్రస్తుతం కేరళలో అట్టపాడిలో కొన్ని సెట్స్ వేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఆ పని పూర్తవుతుంది.
ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇందులో రజినీ కాంత్ సహా ప్రధానా తారణగణమంతా షూట్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగానే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రజనీ పాత్రకు సంబంధించిన షూట్ అంతా 15-20 రోజుల్లోనే పూర్తయ్యే ప్రణాలికతో నెల్సన్ ముందుకెళ్తున్నాడుట. రజనీకాంత్ క్లియర్ గా డేట్లు ఇవ్వడంతో? పూర్తి చేయడం పక్కా అంటున్నారు.
అదే జరిగితే జైలర్ 2 అనంతరం సూపర్ స్టార్ మళ్లీ కొంత విరామం తీసుకుంటారు. కొన్ని రోజుల పాటు మళ్లీ హిమాలయాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త కూడా అంతే అవసరం. హిమాలయాలకు వెళ్లడం అన్నది ఏటా జరిగే ప్రోసస్. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ `జైలర్ 2` డబ్బింగ్ సహా కొత్త సినిమా పనుల్లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.