రజినీకాంత్.. లైకాతో మరొకటి
సూపర్ స్టార్ రజినీకాంత్ లైకా ప్రొడక్షన్ మధ్య ట్రావెలింగ్ లాంగ్ బ్యాక్ ‘రోబో 2.ఓ’ మూవీతో స్టార్ట్ అయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ లైకా ప్రొడక్షన్ మధ్య ట్రావెలింగ్ లాంగ్ బ్యాక్ ‘రోబో 2.ఓ’ మూవీతో స్టార్ట్ అయ్యింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ 570 కోట్ల బడ్జెట్ పెట్టింది. ‘కల్కి 2898ఏడీ’ సినిమాకి ముందు ఇదే దేశంలో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉంది. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మేకర్స్ వందల కోట్ల బడ్జెట్ సునాయాసంగా పెడుతున్నారు.
అయితే 2019లోనే లైకా వారు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్, శంకర్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిన కూడా ఓవర్ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. దీంతో ‘2.ఓ’ నష్టాలు పూడ్చడం కోసం రజినీకాంత్ లైకా ప్రొడక్షన్ లో అలా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రాన్ని సుమారు 200 కోట్ల బడ్జెట్ తో చేశారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
దీని తర్వాత లైకాతోనే తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమా చేశారు. ఇందులో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ మూవీ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. కూతురు కారణంగా జరిగిన నష్టానికి పరిహారంగా రజినీకాంత్ మరల ‘వేట్టయ్యన్’ సినిమాని లైకా ప్రొడక్షన్ లో చేశారు. ఈ సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టింది. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే ఈ మూవీ ఇప్పటి వరకు వసూళ్లు చేసింది.
నిజానికి ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో చేయాలని ముందు అనుకున్నారు. కాని అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా లాంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగం అయ్యేసరికి బడ్జెట్ పెరిగిపోయింది. ఓవరాల్ గా 160 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చయ్యింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం పెద్దగా లాభాలు అందించకపోవచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాతో కూడా లైకాకి నష్టం రావడంతో పరిహారంగా రజినీకాంత్ మరో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. లైకా ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేయడంతో మరో చిత్రం చేస్తానని రజినీకాంత్ మాటిచ్చారంట. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. తరువాత ‘జైలర్’ సినిమాని నెల్సన్ దిలీప్ తో చేయబోతున్నారు. ఈ రెండింటి తర్వాత లైకా వారికి ఒక సినిమా చేస్తాడేమో చూడాలి.