సూపర్ స్టార్స్ ఇద్దరి మధ్య యుద్దం తప్పదా!
రాజకీయాలు వేరు. సినిమాలు వేరు అని అంటారు. కానీ అలా అది అనడం వరకే పరిమితం. జరగాల్సిం దంతా బ్యాకెండ్ లో జరిగిపోతుంది.;

రాజకీయాలు వేరు. సినిమాలు వేరు అని అంటారు. కానీ అలా అది అనడం వరకే పరిమితం. జరగాల్సిం దంతా బ్యాకెండ్ లో జరిగిపోతుంది. పరోక్షంగా సినిమాల్లో పాత్రల రూపంలో సెటెర్లు వేయడం చాలా తెలుగు సినిమాల్లో పరిపాటే. వ్యవహారం వైరం మొదలు కానంత సేపే. మొదలైతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అనడానికి చాలా ఉదహారణలున్నాయి. అందులోనూ కోలీవుడ్ లో వైరం మొదలైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
తలపతి విజయ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడంతో? పార్టీ బలోపేతంలో భాగంగా అధికార పక్షంపై గుప్పించిన విమర్శలపై సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య లోలోపల పెద్ద యుద్దమే జరుగుతోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ఆరోపణలు..ప్రత్యారోపణలతో హైలైట్ అవుతున్నారు.
పాత తరం అభిమాన సంఘాల మధ్య అంతర్గతంగా పెద్ద యుద్దమే జరుగుతోంది. అయితే ఈ వార్ వచ్చే పొంగల్ కి పీక్స్ కి చేరే అవకాశం ఉంది. సంక్రాంతి సందర్భంగా విజయ్ నటిస్తోన్న పొలిటికల్ వార్ `జన నాయగన్` రిలీజ్ అవుతుంది. జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే సీజన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `జైలర్ 2` కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
రజనీ సినిమా రిలీజ్ కు ఉందని `జన నాయగన్` ని వాయిదా వేయించాలని ఇప్పటికే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. సీనియర్ హీరో ముందు జూనియర్ హీరో రావడం ఏంటనే వాదన జరుగుతోంది. ఈ నేపథ్యంలో `జన నాగయన్` వాయిదా వేసుకోమని నిర్మాతకు అల్లిమేటం కూడా వెళ్లిందని కోలీవుడ్ మీడి యాలో ప్రచారం జరుగుతోంది. ప్రతిగా విజయ్ అభిమానులు కూడా కౌంటర్ ఎటాక్ కి దిగుతున్నట్లు వినిపిస్తుంది. ఈ భూకంపం పీక్స్ కి చేరిందంటే మాత్రం సునామీ తప్పదు.