రజనీకాంత్ 'కూలీ' కథ వెనుక కథ...!

ఇటీవల అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన రజనీకాంత్‌ తిరిగి కూలీ సినిమా షూటింగ్‌ కు హాజరు అవుతున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Update: 2024-10-25 09:30 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ జైలర్ సినిమా తర్వాత మళ్లీ పుంజుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని, అందుకే సినిమాలకు రజనీ దూరం అవ్వాలని భావిస్తున్న సమయంలో దక్కిన జైలర్‌ హిట్‌ దక్కింది. దాంతో రజనీకాంత్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వేట్టయాన్ సినిమాతో రజనీకాంత్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జై భీమ్‌ చిత్ర దర్శకుడు జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. జైలర్ స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్‌ వచ్చినా కలెక్షన్స్ మాత్రం బాగానే నమోదు అయ్యాయి.

వేట్టయాన్ ఫలితం పట్టించుకోకుండా రజనీకాంత్‌ ప్రస్తుతం తన కూలీ సినిమాను ముగించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన రజనీకాంత్‌ తిరిగి కూలీ సినిమా షూటింగ్‌ కు హాజరు అవుతున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాల గురించి సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కనుక కూలీ సినిమాకు భారీ బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు.

విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంపిక చేసుకుని, ఆ కథలను పవర్‌ ఫుల్‌ పాత్రలతో నడిపించడం ద్వారా లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్‌ చేసిన ఈ దర్శకుడు కూలీ కథ కు ముందు రజనీకాంత్‌ కోసం మరో కథను అనుకున్నాడట. రజనీకాంత్‌ స్థాయికి తగ్గట్లుగా ఆ కథను మలచడంలో ఆయన విఫలం అయ్యారట. దాంతో కూలీ సినిమా ప్రాజెక్ట్‌ ను తెరపైకి తీసుకు వచ్చారనే వార్తలు వస్తున్నాయి. కూలీ కథ లోకేష్ సొంత కథ కాదేమో అనే అనుమానాలు తమిళ మీడియా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి కూలీ కథ వెనుక పెద్ద కథ ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

రజనీకాంత్‌ వంటి సూపర్ స్టార్‌తో సినిమా అంటే ఏ దర్శకుడికి అయినా కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. అందుకే మొదటి కథను డీల్ చేయలేకపోయాడట. అందుకే కూలీ కథను తీసుకుని పట్టాలెక్కించారనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ ఎంత భారీ బడ్జెట్‌ సినిమా అయినా, ఎంతటి స్టార్‌ సినిమా అయినా ఆరు నెలల కంటే ఎక్కువ మేకింగ్‌ కి తీసుకోడు. కనుక వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. విక్రమ్‌ తో కమల్‌ హాసన్ కి ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడో అదే తరహాలో రజనీకాంత్‌ కి కూలీతో భారీ విజయాన్ని లోకేష్ కనగరాజ్ ఇవ్వడం ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News