రజనీకాంత్ కే చుక్కలు చూపించిన మణిరత్నం!
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ కి మణిరత్నం చుక్కలు చూపించిన ఓ సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్...మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి-మణిరత్నం కాంబినేషన్ లో రిలీజ్ అయిన 'తలపతి' ( తెలుగులో దళపతి) అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1991 లో రిలీజ్ అయిన సినిమా ట్రెండ్ సెంట్టర్ గా నిలిచింది. మణిరత్నం కళాఖండాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కమర్శియల్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ కి మణిరత్నం చుక్కలు చూపించిన ఓ సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు.
చివరికి మణిరత్నం మీద చికాకు వచ్చి సినిమానే వదిలేద్దాం అనుకున్నారు. అదేంటో ఆయన మాటల్లోనే.. 'తొలి రోజు మొదటి సన్నివేశమే శోభనతో ఉంటుదని చెప్పారు. సరిగ్గా చేయకపోతే రజనీకాంత్ స్థానంలో కమల్ హాసన్ వస్తారని చమత్కరించారు. ఆసినిమాలో నటించడం చాలా కష్టమైంది. నటుడిగా నేను కొన్ని రకాల ఎక్స్ ప్రెషన్ లకే బాండ్ అయి ఉన్నాను. లవ్ సన్నివేశాలు, వాటిలో కొన్ని బేసిక్స్ తెలుసు.
నాకు వచ్చినట్లు చేసాను. చాలాసార్లు చాలా టేక్ లు తీసుకుని చేసాను. కానీ మణిరత్నం మాత్రం ఏ టేక్ ఒకే చేయలేదు. ఎలా నటించినా ఓ పట్టాన ఒప్పుకునే వారు కాదు. చివరికి విసుగు చెంది కమల్ హాసన్ కి ఫోన్ చేసినా ఈ వ్యక్తితో కష్టమని చెప్పాను. వెంటనే కమల్ హాసన్ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసన్నారు. అప్పుడాయన మణిని నటించి చూపించమనండి... అతన్ని కాపీ నటించండని సలహా ఇచ్చారు.
ఆ కాల్ నిజంగా అప్పుడు వర్కౌట్ అయింది. థాంక్స్ కమల్ అని ఫోన్ పెట్టేసాను' అని అన్నారు. తలపతి వెనుక ఇలా ఇంత కథ ఉంది అన్న మాట. 'తలపతి'లో రాజకీయ నాయకుడి దగ్గర రజనీకాంత్ నమ్మిన బంటు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ 170వ సినిమా చేస్తున్నాడు. అదే 'వెట్టేయాన్'. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తయింది.