మనవడు స్కూల్ కి వెళ్లనంటే ఎత్తుకెళ్లి పడేసిన సూపర్ స్టార్!
బాల్యం లో స్కూల్ కి వెళ్లాలంటే కొంతమంది తల్లిదండ్రలకు పిల్లలు చుక్కలు చూపిస్తారు.
బాల్యం లో స్కూల్ కి వెళ్లాలంటే కొంతమంది తల్లిదండ్రలకు పిల్లలు చుక్కలు చూపిస్తారు. వెళ్లననని ఎంత మొత్తుకున్నా అతిబలవంతంగా తీసుకెళ్లి స్కూల్లో పడేస్తారు. అయినా తప్పించుకుని వచ్చే స్తుంటారు. దీంతో నాలుగు దెబ్బలేసి మరీ దిగబెడతారు. ఆ సమయంలో పెనుగులాట ఎలా ఉంటుందో తెలిసిందే. తెలిసీ తెలియని వయసు పిల్లలతో ఆరకమైన ఇబ్బందులు తల్లిదండ్రులకు తప్పవు.
తాజాగా అదే రేంజ్ లో సీన్ ఇంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ కుమారుడు ని స్వయంగా దగ్గరుండి మరీ స్కూల్ కి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ రోజు (శుక్రవారం) తన కుమారుడు వేద్ పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని సౌందర్య చెప్పారు. దీంతో లాభం లేదనుకున్న రజనీకాంత్ రంగంలోకి దిగి కారు ఎక్కించి స్కూల్ కి తీసుకెళ్లారు.
ఆ సమయంలో ముఖం సీటు వైపుగా తిప్పుకుని అలిగిన వేద్ని చూడొచ్చు. ఇంట్లో అతి పెద్ద విధ్వంసం తర్వాత రజనీ ఇలా స్కూల్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నేరుగా క్లాస్ రూమ్ లోనే వేద్ని దించారు. ఆ సమయంలో అక్కడ పిల్లలతో రజనీ కాసేపు నవ్వుతూ మాట్లాడారు. `ఆఫ్ స్క్రీన్ అయినా,.. ఆన్ స్క్రీన్ అయినా.. ఏం చేసినా అతనే కింగ్. లవ్ యూ ఫాదర్` అంటూ సౌందర్య పోస్ట్ చేసారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా తాతయ్యలు మనవలని స్కూల్ కి తీసుకెళ్లడం రేర్. అందులోనూ సెలబ్రిటీ తాతయ్య తీసుకెళ్లడం ఎక్కడో కనిపించదు. రజనీకాంత్ ఆపని చేసి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. సూపర్ స్టార్ ఎల్లప్పుడు సింపుల్ గా ఉండే వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ ....టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో `వెట్టయన్` చిత్రంలో, లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలిలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.