రజని స్టైల్ కా రాజా..!

సూపర్ స్టార్ రజనికాంత్ అంటే స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్టే. సినిమాల్లో ఆయన వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా అన్ని నచ్చడం వల్లే ఆయన్ను సూపర్ స్టార్ చేశారు ఆడియన్స్.

Update: 2023-07-15 09:18 GMT

సూపర్ స్టార్ రజనికాంత్ అంటే స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్టే. సినిమాల్లో ఆయన వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా అన్ని నచ్చడం వల్లే ఆయన్ను సూపర్ స్టార్ చేశారు ఆడియన్స్. అసలు కండక్టర్ గా ఉన్న అతను హీరోగా చేసింది కూడా అతని స్టైల్ వల్లే.

సిగరెట్ ని అలా స్టైల్ గా తీసుకోవడం వెలిగించడంలాంటివి చూసే కదా రజనికి బాలచందర్ గారు అవకాశం ఇచ్చింది. తన స్టైల్ విషయం లో రజని ఎప్పుడూ ది బెస్ట్ గా ఉంటారు. వెండితెర మీద పాత్ర తాలూఖా ప్రభావం వల్ల స్టైల్ గా కనిపించే రజని.. ఆఫ్ స్క్రీన్ కూడా తన సింప్లిసిటీలో కూడా స్టైల్ గా కనిపిస్తారు.

రజని ప్రస్తుతం జైలర్ తో పాటుగా ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం సినిమా లో నటిస్తున్నారు. ఈమధ్యనే లాల్ సలాం సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్న రజనికాంత్ మాల్దీవ్స్ కి వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవ్స్ వెళ్లిన రజనికాంత్ శ్రీలంక ఎయిర్ లైన్స్ లో ప్రయాణించారు. చెన్నై నుంచి మాల్దీవ్స్ క్యాపిటల్ మాలె వరకు వెళ్లారు రజనికాంత్. చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజని బ్యాగ్ పట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్ గా కనిపించారు.

శ్రీలంక ఫ్లైట్ లో రజనికాంత్ ప్రయాణించడం పై శ్రీలంక ఎయిర్ లైన్స్ తమ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తపరచింది. ఇక సినిమాల విషయానికి వస్తే రజనికాంత్ జైలర్ ఆగష్టు 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. రజని లుక్స్ తో పాటుగా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ జైలర్ కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

రజని తమిళ హీరోనే అయినా తెలుగు లో కూడా ఆయన స్టార్ క్రేజ్ సంపాదించారు. ఒకానొక దశ లో రజని సినిమా వస్తుంది అంటే ఇక్కడ స్టార్స్ భయపడే రేంజ్ ఉండేది. అయితే క్రమ క్రమంగా రజని మార్కెట్ తెలుగు లో తగ్గుతూ వచ్చింది. వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కూడా రజని సినిమా మీద ఆసక్తి కోల్పోతున్నారు. జైలర్ సినిమా కు ఇంకా తెలుగు బిజినెస్ జరగలేదని టాక్. నిర్మాతలు ఎక్కువ అడుగుతుండగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అంత పెట్టే ఆలోచన లో లేదని తెలుస్తుంది. రజని మార్కెట్ తెలుగు లో ఇంత దారుణంగా పడిపోతుందని ఎవరు ఊహించలేదు.

Tags:    

Similar News