సూపర్‌స్టార్ 50 ఏళ్ల కెరీర్‌లోనే
కానీ అలాంటి అంచనాలను క్రియేట్ చేయడంలో `లాల్ సలామ్` విఫలమైంది.
2023లో కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఏడాది తిరగక ముందే కెరీర్ వరస్ట్ సినిమాని కూడా అందించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రజనీకాంత్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లోను క్రేజ్ ఉంటుంది. పైగా 600 కోట్లు వసూలు చేసిన జైలర్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాపై సహజంగానే అంచనాలుంటాయి.
కానీ అలాంటి అంచనాలను క్రియేట్ చేయడంలో `లాల్ సలామ్` విఫలమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా, ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించిన లాల్ సలామ్ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. వీక్ కంటెంట్ ప్రత్యేకత లేని జానర్ తో రూపొందించిన ఈ సినిమాపై తొలి నుంచి బజ్ లేకపోవడం ప్రచారం పరంగా కూడా ఎలాంటి ప్రయత్నం లేకపోవడం దారుణ వైఫల్యానికి కారణమైందని భావిస్తున్నారు.
ముఖ్యంగా AP-TSలో ఈ చిత్రం 50 లక్షలు అయినా వసూలు చేయడానికి చాలా తంటాలు పడింది. నైజాం జీవితకాల షేర్ 12 లక్షలకు కూడా చేరకపోవచ్చని ట్రేడ్ చెబుతోంది. ఏపీలో 37లక్షల వసూళ్లను మాత్రమే సాధించింది. ఐదు దశాబ్దాల కెరీర్‌లో రజనీకాంత్ చెత్త సినిమాలో నటించారు! అంటూ ట్రేడ్ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఐశ్వర్య రజనీకాంత్ మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తే ప్రతిదీ ఫ్లాప్ గానే మిగిలాయి. 3 సినిమాతో ఆమె దర్శకురాలిగా ఆరంగేట్రం చేసారు. ఇక రజనీకాంత్ బ్లాక్ బస్టర్లను ఇప్పుడు రీరీలీజ్ చేసినా కానీ చక్కని వసూళ్లు వస్తాయి కదా! అని కొందరు విశ్లేషిస్తున్నారు. తదుపరి రజనీకాంత్ కి లోకేష్ కనగరాజ్ సినిమా పెద్ద ఊరటనిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కనగరాజ్ తనదైన శైలి స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో రజనీకి జైలర్ ని మించిన హిట్టిస్తాడని, కనగరాజ్ సరైన చికిత్స చేస్తాడని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.