హిట్టు పడక ముందే డైరెక్టర్ ని నమ్మిన హీరో..!

టాలెంట్ ని ఒడిసి పట్టుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు హీరోలు ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెబితే అతను ముందు వారి వర్క్ చూసి హిట్లు ఫ్లాపులు బేరీజు వేసుకుని అవకాశం ఇస్తారు.

Update: 2024-12-01 07:15 GMT

టాలెంట్ ని ఒడిసి పట్టుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు హీరోలు ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెబితే అతను ముందు వారి వర్క్ చూసి హిట్లు ఫ్లాపులు బేరీజు వేసుకుని అవకాశం ఇస్తారు. మరికొందరు హీరోలు అతను చెప్పిన కథ నచ్చితే తీయగలడు అన్న నమ్మకం కుదిరితే చాలు సినిమా ఓకే చేస్తారు. ఐతే డైరెక్టర్ పై హీరో నమ్మకం పెట్టినప్పుడు అతను కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. ఐతే ఈ లీడ్ అంతా దేనికి అంటే రీసెంట్ గా అమరన్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ కు అతను ఆ సక్సెస్ అందుకోకముందే క్రేజీ ఆఫర్ ఇచ్చాడట కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.

అమరన్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ధనుష్ సార్ తన మీద నమ్మకం ఉంచారని సినిమా ఫలితం తేలకముందే నమ్మకం పెట్టుకోవడం చాలా గొప్ప విషయమని ఇటీవల దర్శకుల స్పెషల్ చిట్ చాట్ లో అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ చెప్పారు. ధనుష్ సార్ కి అమరన్ రిలీజ్ కావడానికి 11 నెలలు ముందే కలిశాను. అప్పుడే ఆయన తన డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

అమరన్ సినిమా సక్సెస్ అయ్యాక రాజ్ కుమార్ ఏ హీరోకి కథ చెప్పినా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ అమరన్ సినిమా రిలీజ్ కాకుండానే ధనుష్ తనకు ఛాన్స్ ఇస్తానన్నారని చెప్పారని రాజ్ కుమార్ వెల్లడించారు. శివ కార్తికేయ లీడ్ రోల్ లో నటించిన అమరన్ సినిమా రీసెంట్ గా రిలీజై 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా దర్శకుడిగా రాజ్ కుమార్ కి ఒక రేంజ్ లో పాపులారిటీ ఏర్పడింది.

అమరన్ తర్వాత నెక్స్ట్ రాజ్ కుమార్ ఎవరితో సినిమా చేస్తాడన్న ఆసక్తి మొదలైంది. ఐతే డైరెక్టర్స్ స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమా ధనుష్ తోనే అని హింట్ ఇచ్చారు. ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాల్లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ తో ధనుష్ కాంబో ఫిక్స్ అయితే ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో అని ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అమరన్ తో హిట్ కొట్టిన రాజ్ కుమార్ తో సినిమా చేసేందుకు హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ధనుష్ ఫ్రీ అవ్వగానే రాజ్ కుమార్ సినిమా డిస్కషన్స్ మొదలవుతాయని తెలుస్తుంది.

Tags:    

Similar News