నిర్మాతల్ని వేధించే హీరోని కాదు!
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ రేంజ్ లో 800 కోట్లు సాధిస్తుందని యూనిట్ సైతం గెస్ చేయలేదు.
ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం `స్త్రీ-2` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ రేంజ్ లో 800 కోట్లు సాధిస్తుందని యూనిట్ సైతం గెస్ చేయలేదు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 100 కోట్లు మాత్రమే. వసూళ్ల రూపంలో 800 కోట్లు అంటే? మిగతా బిజినెస్ డీల్స్ ద్వారా ఇంకెత రాబట్టి ఉంటుందో ఊహించొచ్చు.
దీంతో మరోసారి శ్రద్దా కపూర్ బాక్సాఫీస్ క్వీన్ గా మారిపోయింది. ఇందులో రాజ్ కుమార్ రావ్ మరో మెయిన్ లీడ్ పోషించిన నటుడు. అయితే ఈసినిమా విజయం తర్వాత రాజ్ కుమార్ రావు భారీగా పారితోషిం పెంచాసాడనే వార్తలు కుదిపిపేస్తున్నాయి. తాజాగా వీటిపై ఆయన స్పందించాడు. `ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నాని నాపై ఎన్నో వార్తలొస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. నా నిర్మాతలపై అంత భారం మోపేవాడిని కాదు.
అంతటి స్వార్ద పరుడిని కాదు. పారితోషికం అన్నది నా నటనకు లభించిన బహుమానంగా భావిస్తా. `స్త్రీ2` సక్సెస్ లో భాగం అవ్వడం నా అదృష్టం. ఆ సినిమా విజయం నా స్వభావాన్ని మార్చదు. నేను జీవితమంతా పని చేయాలని కోరుకుంటున్నాను. అందుకే పారితోషికం విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోను. సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకుంటూ ఎదగడానికి ఉపయోగ పడే సినిమాలుచేస్తాను. నా దగ్గర వంద కోట్లు ఉన్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
నా దగ్గర అంత డబ్బు లేదు. నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు అన్న సంగతి అందరికీ తెలుసు. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఎన్నికోట్లు పారితోషికం తీసుకున్నా డబ్బు కంటే సినిమానే ముఖ్యం. సినిమాలు చేసిన తర్వాత నాకు డబ్బు వచ్చింది తప్ప డబ్బు ముందు వచ్చిన తర్వాత సినిమా నా జీవితంలో కి రాలేదు` అని అన్నారు.