ఆయ‌న‌ 'అమ్మా నీ డీఎన్ ఏ ఇంతే' అన్నారు!

'అమ్మా నీ డీఎన్ ఏ ఇంతే.. నువ్వొక రాజ్ కుమార్ హిరాణీ అని సంతోష ప‌డు' అని న‌వ్వేసారు. నాకు ఎవ‌రు రాసినా న‌చ్చ‌దు. నా క‌థ్న‌లి నేను స్వ‌యంగా రాసుకోవాలి.

Update: 2024-07-07 13:30 GMT

'గురు', 'ఆకాశం నీహ‌ద్దు రా' లాంటి చిత్రాల‌తో లేడీ డైరెక్ట‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు సుధ కొంగ‌ర‌. లేడీ డైరెక్ట‌ర్ల‌లో తానో యూనిక్ అని ఆ రెండు సినిమా ఫ‌లితాలే చెబుతాయి. బ‌ల‌మైన క‌థ‌లు, శ‌క్తివంతైన పాత్ర‌లు రాయ‌డం అన్న‌ది లేడీ డైరెక్ట‌ర్ల‌లో ఆమెకి మాత్ర‌మే సాధ్య‌మైంది. 20 ఏళ్ల జర్నీలో తీసింది ఆరు సినిమాలే అయినా అవి అద్భుతాల‌నే చెప్పాలి.

మ‌రి సుధ కొంగ‌ర సినిమాల‌కు ఎందుకు అంత ఆల‌స్య‌మ‌వుతుంది? అన్నేళ్ల జ‌ర్నీలో 6 సినిమాల‌కే ప‌రిమితం అవ్వ‌డం ఏంటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇలా ఉంది. ' నాకు అదే అనిపిస్తుంది. ఇన్ని త‌క్కువ సినిమాలు చేసాన‌ని నాకు అప్పుడ‌ప్పుడు అనిపిస్తుంది. అలాగే అంత‌కంటే వేగంగా ముందుకు వెళ్ల‌లేను అనిపిస్తుంది. ఓసారి ఇదే విష‌య‌మై నిర్మాత సురేష్ బాబు వ‌ద్ద చెబితే? ఆయ‌న ఒక‌టే మాట అన్నారు.

'అమ్మా నీ డీఎన్ ఏ ఇంతే.. నువ్వొక రాజ్ కుమార్ హిరాణీ అని సంతోష ప‌డు' అని న‌వ్వేసారు. నాకు ఎవ‌రు రాసినా న‌చ్చ‌దు. నా క‌థ్న‌లి నేను స్వ‌యంగా రాసుకోవాలి. రాసే క‌థ గురించి అంతంత మాత్ర‌మే అవ‌గాహ‌న ఉంటే దాని గురించి పూర్తిగా తెసుకునే వ‌ర‌కూ పెన్ను పెట్ట‌ను. ఏ విష‌యంపైనైనా పూర్తిగా ప‌ట్టు సాధించాలి అన్న‌ది నా ఉద్దేశం . అలా లేక‌పోతే ఆ ప‌ని అసంపూర్ణంగానే ముగుస్తుంది. స‌రైన ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉండ‌దు.

అందుకే నా సినీ ప్ర‌యాణం ఇంత నెమ్మ‌దిగా సాగుతుంది. అలాగని నేను ఎప్పుడు బాధ ప‌డ‌లేదు. ఆల‌స్య‌మైనా ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాలు ఇవ్వాల‌నే త‌ప‌న‌తోనే ప‌నిచేస్తాను. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. సూర్య‌తో ఓ సినిమా అనుకున్నా. కానీ అది ప‌ట్టాలెక్క‌లేదు. ప్రస్తుతానికి ఆగింది. కానీ ఆ క‌థ‌ని మ‌రో హీరోతో చేయ‌డం లేదు. సూర్య కోసం మాత్ర‌మే రాసుకున్నస్టోరీ అది. ఆయ‌న‌తోనే తీస్తాను. కానీ స‌మ‌యం ప‌డుతుంది' అని అన్నారు.

ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ హీరోగా 'స‌ర్పిరా' అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇది 'ఆకాశం నీ హ‌ద్దురా' చిత్రానికి రీమేక్ రూపం. తెలుగు, త‌మిళ్ లో ఈ సినిమా మంచి విజ‌యం సాధించిం ది. బాలీవుడ్ లో 'స‌ర్పిరా' పై మంచి అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News