ఆ స్టార్ రెండు సార్లు 1000 కోట్లు.. ప్రభాస్ ముందు తుస్

త్రీ ఇడియట్స్ పీకే లాంటి సినిమాలతో ఇండియన్ సినిమా హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజకుమార్ హిరాని

Update: 2023-12-23 17:30 GMT

త్రీ ఇడియట్స్ పీకే లాంటి సినిమాలతో ఇండియన్ సినిమా హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజకుమార్ హిరాని. ఇక అలాంటి దర్శకుడు రెండుసార్లు వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సునామి క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్ తో సినిమా వస్తుంది అనగానే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా డంకి అసలు మొదటి అడుగులోనే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్నంత బజ్ కనీసం ఆ సినిమా విడుదలైనప్పుడు కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమాలో సలార్ కు ఊహించని స్థాయిలో కొంత దెబ్బ కొట్టే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా కామెంట్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో గత వారం నుంచి సలార్ వర్సెస్ డంకి అనే రేంజ్ లో ఫ్యాన్స్ మధ్య కొత్త వివాదాలు అయితే నడిచాయి.

కానీ అసలు డంకి సినిమా సలార్ కు ఏ విషయంలోనూ పోటీ అయితే ఇవ్వలేదు అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తే అసలు షారుఖ్ ఖాన్ కు ప్రభాస్ కు చాలా వ్యత్యాసం ఉంది అనేలా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే డంకీ సినిమా మొదటి రోజు కేవలం 58 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమా మాత్రం అంతకు మూడింతలు ఎక్కువగా 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

దీన్నిబట్టి షారుక్ ఖాన్ కంటే ప్రభాస్ మాస్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశా షారుఖ్ ఖాన్ యాక్షన్ సినిమాతో వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే అంత తీసిపారేయడానికి వీలు లేదు. ఆ కాంబినేషన్ అనేది సలార్ కు పోటీ ఇవ్వాల్సిన సినిమా. కానీ సలార్ ముందు చాలా తక్కువగా కనిపించడం కొత్త ఆశ్చర్యాన్ని కలిగించింది.

పైగా ప్రమోషన్స్ విషయంలో అయితే సలార్ కంటే డంకి వాళ్లే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక షారుఖ్ అయితే ఈ ఏడాది పఠాన్, జావాన్ సినిమాలతో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న హీరో. కానీ ఆ క్రేజ్ కూడా ప్రభాస్ ఇమేజ్ ముందు సరితుగాలేదు. దీంతో ఇప్పుడు షారుక్ కంటే ప్రభాస్ రేంజ్ చాలా పెద్దది అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి.

Tags:    

Similar News