సౌరవ్ గంగూలీ పాత్రలో పాపులర్ నటుడు?
ఇది ఆట కంటే ఎక్కువగా గంగూలీ పర్సనల్ కోణాన్ని తెరపై ఆవిష్కరించనుందట.;

స్త్రీ2తో ఈ ఏడాది అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాజ్ కుమార్ రావు. ప్రతిభావంతుడైన ఈ నటుడు తదుపరి ఓ ప్రముఖ క్రీడాకారుని బయోపిక్ లో నటిస్తాడని కథనాలొస్తున్నాయి. ట్రాప్డ్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. ఇది పూర్తిగా క్రీడల ఆధారంగా రూపొందే చిత్రం.
మిడ్-డే కథనం ప్రకారం...విక్రమాదిత్య నిజ జీవిత క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఒక స్పోర్ట్స్ చిత్రం కోసం పని చేస్తున్నాడు. ఇది సాధారణంగా స్పోర్ట్స్ బయోపిక్‌లలో కనిపించే అండర్‌డాగ్ కంటే భిన్నమైన కథానాయకుడిని తెరపై ఆవిష్కరిస్తుంది. రాజ్ కుమార్ కి అతడి ఆలోచన నచ్చింది. అంతేకాకుండా విక్రమాదిత్య తన సృజనాత్మక సరిహద్దులను దాటి కొత్తగా సినిమాని చూపిస్తాడని రాజ్ నమ్ముతున్నాడు. బయోపిక్ షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలనేది ప్లాన్. అయితే విక్రమాదిత్య దీనికి ముందు కొన్ని నెలలపాటు తీవ్రంగా నటీనటులతో కసరత్తు చేస్తారు`` అని తెలిసింది.
అయితే ఇది ఏ క్రీడాకారుడి కథతో రూపొందుతుంది? అంటే... టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితంపై సినిమా అని, అతడి వివాదాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమాయణాల గురించి తెరపై చూపిస్తారని కూడా గుసగుస వినిపిస్తోంది. ఇది ఆట కంటే ఎక్కువగా గంగూలీ పర్సనల్ కోణాన్ని తెరపై ఆవిష్కరించనుందట. అయితే ఇందులో నిజాల్ని దాచి విక్రమాదిత్య తెరపై ఏం చూపించినా జనం చూడరు. బయోపిక్ అంటే రియాలిటీ చాలా ముఖ్యం.
ప్రస్తుతం రాజ్‌కుమార్ రావు వామికా గబ్బితో తన తదుపరి రొమాంటిక్ కామెడీ -భూల్ చుక్ మాఫ్ కోసం సిద్ధమవుతున్నాడు. నిర్మాతలు ఫిబ్రవరిలో టీజర్‌ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. భూల్ చుక్ మాఫ్ మే 9న థియేటర్లలో విడుదలవుతుంది. కరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.