నిర్మాణ రంగంలోకి స్టార్ హీరో!
రాజ్ కుమార్ రావు బాలీవుడ్ లో ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయకం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడ్డ నటుడు.
రాజ్ కుమార్ రావు బాలీవుడ్ లో ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయకం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడ్డ నటుడు. నెపోటిజం పీక్స్ లో ఉన్న సమయంలో రాజ్ కుమార్ నటుడిగా తెరంగేట్రం చేసి సక్సెస్ అయ్యాడు. తన ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ముంబైలో అతడి సినీ కష్టాలు వర్ణాతీతం అని ఇటీవలే రివీల్ చేసాడు.
`స్త్రీ-2` విజయంతో వందల కోట్ల వసూళ్ల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు జేబులో 18 రూపాయలతో గడిపిన జీవితం నేడు కోట్లకు పడగెత్తింది. తాజాగా రాజ్ కుమార్ రావు నిర్మాతగానూ ఎంట్రీ ఇస్తున్నాడు. `సెక్టార్ 36` ఫేం ఆదిత్యా నింబాల్కర్ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. ఇదే సినిమాతో ఆయన నిర్మాతగా మారుతన్నాడు. హత్య నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ చిత్రమిది. కథ నచ్చడంతో రాజ్ కుమార్ నిర్మించడానికి ముందుకొచ్చాడు.
వాస్తవానికి దర్శకుడు వేరే నిర్మాతలతో సినిమా తీయాలనుకున్నాడు. కానీ కథ విన్నాక తానే నిర్మాతనైతే బాగుం టుందని రాజ్ ముందుకొచ్చారు. మలుపులు, భావోద్వేగాలున్న కథ ఇది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రధమార్దంలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దానికి సంబంధించి రాజ్ కుమార్ రావు నెట్ ప్లిక్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు.
రాజ్‌కుమార్ రావు హర్యానాలోని గురుగ్రామ్‌లో జన్మించారు. అతని తండ్రి సత్య ప్రకాష్ యాదవ్. హర్యానా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. పాఠశాల్లో ఉన్నప్పుడే, కొన్ని కారణాల వల్ల కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండ టంతో అతడి స్కూల్ ఫీజు ఉపాధ్యాయుల్లో ఒకరు చెల్లించారు. కానీ ప్రస్తుతం రాజ్ కుమార్ రావు నికర విలువ రూ.81 కోట్లు. ముంబైలో ఆయనకు సొంత ఇల్లు కూడా ఉంది. అలాగే ఒక సినిమాకు 5-6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.