బిగ్‌బాస్ షో కి రాజ్‌ తరుణ్‌..!

గడచిన మూడు నాలుగు నెలలుగా యంగ్‌ హీరో రాజ్ తరుణ్ పేరు మీడియాలో కంటిన్యూ గా మారుమోగుతూనే ఉంది.

Update: 2024-08-27 09:30 GMT

గడచిన మూడు నాలుగు నెలలుగా యంగ్‌ హీరో రాజ్ తరుణ్ పేరు మీడియాలో కంటిన్యూ గా మారుమోగుతూనే ఉంది. ఆయన నుంచి వరుసగా సినిమాలు రావడం తో పాటు, ఆయన వ్యక్తిగత విషయాల వల్ల మీడియాలో ఉంటున్నాడు. వ్యక్తిగత వివాదాలు, రిలేషన్‌ షిప్‌ విషయమై గొడవలు కాస్త సర్దుమనిగినట్లుగా ఉన్నాయి. ఈ మధ్య మళ్లీ ఎలాంటి హడావుడి అయితే లేదు. అయితే ఈ సమయంలో ఆయన నటించిన 'భలే ఉన్నాడే' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌ గా మనీషా నటించింది.

సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్‌ ఇంకా దర్శకుడు మీడియా ముందుకు వచ్చారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. రాజ్ తరుణ్‌ పై జర్నలిస్ట్‌ లు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ.. రెండు నెలల్లోనే నేను నటించిన మూడో సినిమా విడుదల అవ్వబోతుంది. ఇది ప్లాన్‌ చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగింది. ఈ సినిమా ను ప్రతి ఒక్కరు చూసే విధంగా చక్కగా దర్శకుడు శివ సాయి వర్ధన్‌ రూపొందించారు.

సవాలుగా ఉండే పాత్రలు చేయడాన్ని ఇష్టపడుతాను. రొటీన్ గా ఉండే పాత్రల కంటే కూడా విభిన్నంగా ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడూ రొటీన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతారు. ఈ సినిమా తప్పకుండా థియేటర్‌ లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. ప్రతి సినిమా ఓటీటీ లో ఏదో ఒక సమయంలో రావాల్సిందే. అయితే ఈ సినిమా ఓటీటీ లో వచ్చే వరకు ఆగకుండా ముందే చూసే విధంగా వినోదాత్మకంగా ఉంటుంది. పురుషోత్తముడు, తిరగబడర సామి సినిమాలకు ఎక్కువ ప్రమోషన్స్ చేయలేను పోవడం బాధ కలిగించింది.

రాజ్ తరుణ్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మీ స్పందన ఏంటి అంటూ దర్శకుడు శివ సాయి వర్ధన్ ను ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ... రాజ్ తరుణ్ ఒక్క చోట కుదురుగా ఉండే వ్యక్తి కాదు. కనుక ఆయనకు బిగ్‌ బాస్‌ అనేది అస్సలు సెట్‌ అవ్వదు. ఆయన ఎప్పటికి కూడా బిగ్‌ బాస్ హౌస్‌ లోకి వెళ్లడు. ఇక ఈ సినిమా లోని రాజ్ తరుణ్ పాత్ర ఆయన ఇమేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకుడు శివ సాయి అన్నారు.

Tags:    

Similar News