యువతి ఆరోపణలపై రాజ్ తరుణ్ క్లారిటీ

ఇదిలా ఉంటే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, చేసిన ఆరోపణలపై తాజా ఓ న్యూస్ ఛానల్ లో రాజ్ తరుణ్ స్పందించారు.

Update: 2024-07-05 09:13 GMT

హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తో 11 ఏళ్ళ నుంచి సహజీవనంలో ఉన్నానని, అయితే ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనని మోసం దూరం పెడుతున్నాడని ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ కి నాకు పెళ్లి కూడా అయ్యిందని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అలాగే రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ పేరు కూడా తన ఫిర్యాదులో లావణ్య ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, చేసిన ఆరోపణలపై తాజా ఓ న్యూస్ ఛానల్ లో రాజ్ తరుణ్ స్పందించారు. గతంలో ఆమెతో తాను రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమే అయిన మేమిద్దరం విడిపోయి చాలా కాలం అవుతుందని రాజ్ తరుణ్ తెలిపారు. అలాగే పెళ్లి జరిగినట్లు ఆమె చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవం అని కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. గతంలో ఆమె డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దొరికిపోయిందని, దాంతో పాటు మరో మూడు మోసం చేసిన కేసులు కూడా ఆమె మీద ఉన్నాయని రాజ్ తరుణ్ అన్నారు.

Read more!

ఆమె తనని రెగ్యులర్ గా టార్చర్ చేస్తుందని, ఫిర్యాదుపై ఇప్పటికే డీసీపీతో మాట్లాడటం జరిగిందని, నా వైపు నుంచి క్లారిటీ ఇచ్చానని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. కేవలం తన ఇమేజ్ ని దెబ్బతీసే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా పోలీసులకి ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ లావణ్యపై ఆరోపణలు చేశారు. గతంలో ఉన్న రిలేషన్ ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు బెదిరింపులకి పాల్పడుతుందని అన్నారు.

సంబంధం లేని హీరోయిన్ ని ఆమె ఇందులోకి కావాలనే లాగే ప్రయత్నం చేస్తుందని కూడా తెలిపారు. ఆమె ఆరోపణలో చాలా వరకు నిరాధారమైనవని రాజ్ తరుణ్ సదరు మీడియా ఛానల్స్ లో క్లారిటీ ఇచ్చారు. లావణ్య తన చర్యలతో నన్ను మాత్రమే కాకుండా ఆమె తల్లిదండ్రులని కూడా మానసిక క్షోభకి గురిచేస్తుందని రాజ్ తరుణ్ తెలిపారు. నిజానిజాలు ఏంటి అనేది త్వరలోనే తెలుస్తాయని రాజ్ తరుణ్ స్పష్టత చేశారు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన తిరగబడర సామి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పురుషోత్తముడు అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో కెరియర్ గాడిలో పడుతుందని రాజ్ తరుణ్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తనపై వేధింపుల కేసు రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Tags:    

Similar News

eac