రష్మిక మార్ఫింగ్ వీడియోపై మాజీ ప్రియుడి కామెంట్
నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో తప్పు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇలాంటి టెక్నాలజీతో భవిష్యత్తు తరాలకు మరింత భయాన్ని కలిగించేలా ఉంది అని చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఒక లిఫ్ట్ లో వెళుతున్న అమ్మాయి మొహానికి రష్మిక ఫేస్ ను మ్యాచ్ చేసే విధంగా వీడియోని క్రియేట్ చేశారు.
కొన్ని గంటల్లోనే అధి వైరల్ గా మారిపోయింది. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వాళ్ళు చూస్తే ఆ వీడియో నిజమేమో అనుకునేంతలా అందరిని కంగారు పెట్టేసిందే. అయితే ఈ విషయంపై బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ నాగచైతన్య వరకు అందరూ కూడా ఖండించారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి అని రాబోయే రోజుల్లో ఇలా తప్పులు జరగకుండా ఒక ప్రత్యేకమైన టీమ్ కూడా ఏర్పాటు చేయాలి అని తన ఆలోచనలను తెలియజేశాడు.
అయితే రీసెంట్ గా రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి కూడా ఈ ఘటనపై స్పందించాడు. ప్రస్తుతం అతను తన నెక్స్ట్ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత రష్మిక ఫేక్ వీడియో పై స్పందించాడు.
నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో తప్పు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సాఫ్ట్ వెర్ క్రియేట్ అయినప్పటికీ కూడా దానికి ఒక లైసెన్స్ ఉండాలి. అలాంటి రూల్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి సాఫ్ట్ వెర్స్ ఉపయోగిస్తున్నారు.
వాటిని అరికట్టక పోతే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలియజేసిన రక్షిత్, రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలు కట్టుకున్న అమ్మాయి అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇక రష్మికతో రక్షిత్ శెట్టి మొదట కిర్రిక్ పార్టీ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతోనే ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది. ఇక 2017లో నిశ్చితార్థం చేసుకున్న ఈ ఇద్దరు మళ్ళి కొన్ని నెలలకే విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారుల్లో వాళ్ళు స్టార్ హోదాను పెంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.