మీ శరీరం మాట వినండి.. ఏదీ అతిగా చేయొద్దు!
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల పక్కన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఇప్పుడు ఏ తెలుగు సినిమా లేదు.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల పక్కన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఇప్పుడు ఏ తెలుగు సినిమా లేదు. రకుల్ చివరిగా ఇండియన్2 సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమాలో రకుల్ పాత్రకు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో పాటూ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కూడా అవడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తు లేదు.
అయితే రకుల్ రీసెంట్ గా గాయపడిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అమ్మడు ఇప్పుడు మళ్లీ తన తర్వాతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. గాయపడిన రకుల్ కొన్నాళ్ల పాటూ రెస్ట్ తీసుకుని ఇప్పుడు సెట్స్ లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రకుల్ తన గాయం గురించి, దాన్నుంచి ఆమె నేర్చుకున్న విషయాల గురించి ఓ ఇంటర్య్వూలో మాట్లాడింది.
గాయపడిన తర్వాత తనకు తన శరీరంపై గౌరవం పెరిగిందని, దాని వల్ల కెరీర్ పై దృష్టి పెట్టగలగడం నేర్చుకున్నట్టు రకుల్ తెలిపింది. అంతేకాదు ఏదీ అతిగా చేయకూడదని తనకు అర్థమైనట్టు రకుల్ ఈ సందర్భంగా చెప్పింది. మన శరీరం మాట మనం వినాలని, లిమిట్స్ ను దాటి మరీ అతిగా ఎక్సర్‌సైజులు చేయొద్దని రకుల్ అందరికీ సూచిస్తుంది.
గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్ లోకి రావడం ఎంతో ఆనందాన్నిస్తుందని, ఇక నుంచి ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా వర్క్ చేస్తానని రకుల్ వెల్లడించింది. ఇక తన భర్త గురించి మాట్లాడుతూ, ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ఎవరైనా ప్రాణ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ లైఫ్ చాలా అందంగా, ఆనందంగా ఉంటుందని చెప్పిన రకుల్, తన భర్త ఆమెని ప్రతీ విషయంలో అర్థం చేసుకుంటూ, ఆమె చేసే ప్రతి పనికీ మద్దతు ఇస్తూ ఉంటాడని, అతను దొరకడం తన అదృష్టమని రకుల్ పేర్కొంది.
ఇక కెరీర్ విషయానికొస్తే, రకుల్ చేతిలో ప్రస్తుతం మేరే హస్బెండ్ కీ బీవీ అనే సినిమా ఉంది. ఈ సినిమా చాలా భిన్నమైన కథతో రూపొందుతుందని, ఇప్పటివరకు ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి సినిమా రాలేదని చెప్పింది. అంతేకాదు ఈ సినిమాకు రకుల్ భర్తే ప్రొడ్యూసర్. అందుకే మేరే హస్బెంర్ కీ బీవీ మూవీ తనకు మరింత స్పెషల్ అని తెలిపింది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.