రకుల్ ప్రీత్ సింగ్.. హీటెక్కించే లుక్ చూశారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్స్ ఫాలోవర్స్‌ కలిగిన రకుల్, తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ టిప్స్ పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Update: 2024-12-26 22:30 GMT

రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పికాక్ మ్యాగజైన్ డిసెంబర్ 2024 కవర్‌కి ప్రత్యేకంగా దిగిన ఫోటోలో రకుల్ మెరిసిపోయింది. ఈ ఫోటోలో ఆమె గ్లామర్, గ్లాసీ లుక్, గ్రేస్ అన్నీ కలగలిపి ఒక కొత్త అందం ప్రదర్శించింది. తన ప్రత్యేకమైన స్టైల్ స్టేట్మెంట్‌తో ప్రతిసారీ ఆకట్టుకునే రకుల్, ఈసారి మరింత అందంగా కనిపించింది. సెక్విన్ డ్రెస్‌లో ఆమె హై-ఫ్యాషన్ లుక్ ఫ్యాషన్ లవర్స్‌కి స్పూర్తిగా నిలిచింది.

 

ఆమె ఈ ఫోటోకి ఇచ్చిన కామెంట్ కూడా చాలా ఇన్స్‌పైరింగ్ గా ఉంది. "సినిమాలు నటుల కోసం మాట్లాడతాయి. బాక్సాఫీస్ ఫలితాలు అనిశ్చితమైనవైనా, సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తే అదే అసలు విజయం," అంటూ తన నటనా ప్రయాణం గురించి రకుల్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ మాటలు ఫ్యాన్స్‌కి కేవలం ప్రేరణగా కాకుండా, ఆమెకు సినిమా మీదున్న ప్యాషన్‌ను హైలైట్ చేశాయి.

రకుల్ ప్రీత్ కెరీర్ విషయానికి వస్తే, తెలుగులో కెరటం సినిమాతో ప్రారంభం అయ్యింది. ఇక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో బ్రేక్ పొందింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో అడుగుపెట్టి, అక్కడ కూడా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్స్ ఫాలోవర్స్‌ కలిగిన రకుల్, తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ టిప్స్ పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజా ఫోటోలో ఆమె గ్లామర్ మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా చాటిచెప్పింది. "మాటల్లో కాకుండా, పనిలోనే నమ్మకం," అనే విధంగా ఆమె చూపించే ప్రతి లుక్ ఒక కొత్త మెసేజ్‌ను అందిస్తుంది.

ఈ ఫోటోషూట్‌తో రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి గ్లామర్ క్వీన్ అని ప్రూవ్ చేసింది, ఇక ప్రస్తుతం అమ్మడు మరో సాలీడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె నుంచి చివరగా వచ్చిన ఇండియన్ 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో కూడా అవకాశాల కోసం ఏసురుచూస్తోంది. మరి అమ్మడికి నెక్స్ట్ బ్రేక్ ఇచ్చే సినిమా ఎదవుతుందో చూడాలి.

Tags:    

Similar News