బిజీగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటా
తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు అగ్ర హీరోలందరితోనూ నటించిన రకుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.;

తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు అగ్ర హీరోలందరితోనూ నటించిన రకుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ మధ్య రకుల్ పెద్దగా ఫామ్ లో లేకుండా పోయింది. రకుల్ నటించిన ఇండియన్2, మేరే హస్బెండ్ కీ బీవీ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
ప్రస్తుతం అజయ్ దేవగణ్, మాధవన్ లీడ్ రోల్స్ లో వస్తోన్న దే దే ప్యార్ దే2 లో నటిస్తోన్న రకుల్, నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా నటించనుందని వార్తలొస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్తున్న రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ఎవరైనా సరే తమ కెరీర్లో ఉన్న ఫ్లాపుల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ రకుల్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ఫ్లాపుల గురించి మాట్లాడుతుంది. హిట్టూ ఫ్లాపుతో పాటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్సే కీలకమైన ఈ రోజుల్లో రకుల్ నిజాయితీగా ఫ్లాపుల గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇండస్ట్రీలో హిట్టూ, ఫ్లాపులు చాలా కామన్ అని చెప్తున్న రకుల్, జీవితంలో మార్పులు చాలా సహజమని ఎన్ని కష్టాలొచ్చినా డబుల్ ఎనర్జీతో వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని, అలా చేయాలంటే ముందుగా మనమీద మనకు నమ్మకముండాలని అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని రకుల్ అభిప్రాయపడింది.
తన గురించి చెప్తూ, పనిలో ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని చెప్తోన్న రకుల్, షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే ఎంతో ఒత్తిడికి గురవుతుంటానని తెలిపింది. వరుస షూటింగ్స్ లో తన షెడ్యూల్ నిండిపోయి ఉంటే తనకెంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందని చెప్తోన్న రకుల్ ప్రతీ రోజూ కెమెరా ముందుకు ఎదుర్కోవడం తన లైఫ్ లో రొటీన్ గా మారిపోయిందని, ఈ లైఫ్ స్టేలే తననను మంచి పొజిషన్ కు తీసుకెళ్లిందని, ఇది ఇలానే కంటిన్యూ అవాలని కోరుకుంటున్నట్టు రకుల్ తెలిపింది.